నాగ సాధువుగా మారిన మిల్కీ బ్యూటీ

హీరోయిన్ తమన్న నాగసాధువుగా మారింది. కాషాయం కట్టింది. ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంది. మరో చేతితో శివ దండెం పట్టుకుంది. తన్మయత్వంలో ఊగిపోతూ కాశీ ఘాట్స్ లో నడుస్తోంది. ఆమె కొత్త సినిమాలో ఫస్ట్…

హీరోయిన్ తమన్న నాగసాధువుగా మారింది. కాషాయం కట్టింది. ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంది. మరో చేతితో శివ దండెం పట్టుకుంది. తన్మయత్వంలో ఊగిపోతూ కాశీ ఘాట్స్ లో నడుస్తోంది. ఆమె కొత్త సినిమాలో ఫస్ట్ లుక్ ఇది.

రీసెంట్ గా ఓదెల-2 అనే సినిమా కాశీలో స్టార్ట్ అయింది. ఇందులో లీడ్ రోల్ పోషిస్తోంది తమన్న. శివరాత్రి సందర్భంగా ఓదెల-2 నుంచి తమన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో తమన్న లుక్ బాగుంది.

గ్లామర్ రోల్స్ తో పాటు.. క్యారెక్టర్ వెయిట్ ఉండే సినిమాలు చేయడానికి తమన్న ఆసక్తి చూపిస్తోంది. అయితే తెలుగు నుంచి ఆమెకు అలాంటి అవకాశాలిచ్చేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. ఇప్పటికీ ఆమెను ఇక్కడ మిల్కీబ్యూటీగానే చూస్తారు. సంపత్ నంది మాత్రం తమన్నతో ప్రయోగం చేయడానికే సిద్ధమైనట్టు, ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది.

అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది క్రియేటర్ గా వ్యవహరిస్తున్నాడు. కాశీలో ఉండే నాగసాధువు తమన్నాకు, ఓదెల గ్రామంతో ఉన్న కనెక్షన్ ఏంటి, ఓదెల మల్లన్న తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాధ్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ కానుంది.