న‌గ‌రి తెర‌పై కొత్త నాయ‌కుడు

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధాన్యం వుంది. ఇక్క‌డి నుంచి రాజ‌కీయ ఉద్దండులు రెడ్డివారి చెంగారెడ్డి, ముద్దుకృష్ణ‌మ‌నాయుడు లాంటి వారు ప్రాతినిథ్యం వ‌హించారు. ప్ర‌స్తుతం మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధాన్యం వుంది. ఇక్క‌డి నుంచి రాజ‌కీయ ఉద్దండులు రెడ్డివారి చెంగారెడ్డి, ముద్దుకృష్ణ‌మ‌నాయుడు లాంటి వారు ప్రాతినిథ్యం వ‌హించారు. ప్ర‌స్తుతం మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. వ‌రుస‌గా రెండోసారి ఆమె న‌గ‌రి నుంచి గెలుపొందారు. ఒక ముద్దుకృష్ణ‌మ‌నాయుడిని, మ‌రోసారి ఆమె కుమారుడు భానుప్ర‌కాశ్‌ను ఓడించి చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే బీజేపీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి అశోక్‌రాజు ఉత్సాహం చూపుతున్నార‌ని తెలిసింది. 2019లో టీడీపీ నుంచి ఆయ‌న న‌గ‌రి టికెట్ ఆశించారు. గ‌తంలో న‌గ‌రి టికెట్‌పై ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారులు భానుప్ర‌కాశ్‌, జ‌గ‌దీశ్ త‌మ‌కంటే త‌మ‌క‌ని ప‌ట్టుప‌ట్టారు. ఇద్ద‌రిలో ఎవ‌రు పోటీ చేస్తారో తేల్చుకు రావాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ముద్దుకృష్ణ‌మ‌నాయుడి కుటుంబంలో విభేదాల దృష్ట్యా, త‌న అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలించాల‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబును అశోక్‌రాజు కోరినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.

న‌గ‌రిలో రాజుల ఓటు బ్యాంక్ గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో వుంది. విద్యాసంస్థ‌ల వ్యాపారిగా అశోక్‌రాజుకు ఆ నియోజ‌క‌వర్గానికి సుప‌రిచితుడు. ఎలాగైనా ఎమ్మెల్యే కావాల‌నేది ఆయ‌న కోరిక‌. న‌గ‌రిలో వైసీపీ, టీడీపీ అభ్య‌ర్థులుగా త‌న‌కు మాత్రం అవ‌కాశం ల‌భించ‌ద‌ని అశోక్‌రాజు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో బీజేపీ త‌ర‌పున పోటీ చేసి స‌త్తా చూపాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది.

ఒక‌వేళ అశోక్‌రాజు బ‌రిలో వుంటే … టీడీపీ, వైసీపీల‌లో రాజ‌కీయంగా ఏ పార్టీకి న‌ష్టం వాటిల్లుతుందో అనే చ‌ర్చ జ‌రుగుతోంది.