విడుదల తేదీ అప్పుడే చెప్పలేనంటున్న హీరో

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా షూట్ మొత్తం న్యూజిలాండ్ లో ఫిక్స్ చేశాడు విష్ణు. భక్త కన్నప్ప కథకు, న్యూజిలాండ్ లో లొకేషన్లు అద్భుతంగా సింక్ అవుతున్నాయని అంటున్నాడు.…

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా షూట్ మొత్తం న్యూజిలాండ్ లో ఫిక్స్ చేశాడు విష్ణు. భక్త కన్నప్ప కథకు, న్యూజిలాండ్ లో లొకేషన్లు అద్భుతంగా సింక్ అవుతున్నాయని అంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కు విరామం ఇచ్చిన ఈ హీరో, కన్నప్ప షూటింగ్ అప్ డేట్స్ బయటపెట్టాడు.

కన్నప్ప షూటింగ్ ఆల్రెడీ 60 శాతం పూర్తయిందంట. మిగిలిన 40 శాతం షూటింగ్ ను వచ్చే నెల నుంచి మొదలుపెడతారట. మిగిలిన భాగాన్ని కూడా న్యూజిలాండ్ లోనే పూర్తిచేస్తాడట. కొంత ప్యాచ్ వర్క్ మాత్రం ఇండియాలో చేస్తారంట.

ఇక ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడే ఏం చెప్పలేమంటున్నాడు మంచు విష్ణు. మార్చి నాటికి కన్నప్ప షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని, ఆ తర్వాత మాత్రమే రిలీజ్ పై ఓ అవగాహనకు వస్తామని అంటున్నాడు. అయితే ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని మాత్రం ప్రకటించాడు.

కుటుంబంతో కలిసి భోగి సెలబ్రేట్ చేసుకున్నాడు మంచు విష్ణు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పండగలొస్తే కుటుంబంతో కలిసిపోతానని, అసలు పండగలున్నదే కుటుంబాలతో కలవడం కోసమని అంటున్నాడు.

కన్నప్ప సినిమా, మంచు విష్ణుకు ప్రతిష్టాత్మక చిత్రం. ఈ సినిమాలో ప్రభాస్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు, మంచు విష్ణు కొడుకు కూడా ఇదే సినిమాతో వెండితెరకు పరిచయమౌతున్నాడు.