ఎన్టీఆర్- లోకేష్- గుంటూరు కారం?

గుంటూరు కారం సినిమా కథ వెనుక పొలిటికల్ ఛాయలు వెదుకుతున్నారు ఆసక్తి వున్న వాళ్లు. ప్రేమ వివాహం.. కులం.. రాజకీయానికి అడ్డం పడడం, ఆ కుర్రాడిని పక్కకు తప్పించి తమ కులం కుర్రాడినే గద్దె…

గుంటూరు కారం సినిమా కథ వెనుక పొలిటికల్ ఛాయలు వెదుకుతున్నారు ఆసక్తి వున్న వాళ్లు. ప్రేమ వివాహం.. కులం.. రాజకీయానికి అడ్డం పడడం, ఆ కుర్రాడిని పక్కకు తప్పించి తమ కులం కుర్రాడినే గద్దె నెక్కించాలనుకోవడం ఇవన్నీ ఎన్టీఆర్-లోకేష్ లకు పోలి వున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లోకేష్ కోసమే ఎన్టీఆర్ ను పార్టీకి తనంతట తాను దూరం అయ్యేలా చేసారని తెలుగుదేశం పార్టీ రాజకీయాలు పరిశీలించేవారు అంటూ వుంటారు.

సినిమాలో హీరో పాత్ర కూడా ఎన్టీఆర్ మాదిరిగానే చాలా అగ్రెసివ్ గా వుంటుంది. పైగా రాహుల్ రవీంద్రన్ పాత్ర తెలుగు నేర్చుకుంటూ వుంటుంది. తెలుగు టీచర్, పదాల గురించి అడిగి తెలుసుకుంటూ వుండడం ఇవన్నీ సోషల్ మీడియాలో లోకేష్ గురించి వున్న వ్యవహారాలను గుర్తుకు చేసాయి.

చూస్తుంటే లైవ్ పాత్రలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని త్రివిక్రమ్ కథ అల్లి వుంటారనిపిస్తోంది. కానీ ఒకటే అనుమానం.. తెలుగుదేశం, లోకేష్ ను గుర్తుకు తెచ్చేలా ఎందుకు ఇలా చేసి వుంటారు అన్నదే.