2019 ఎన్నికల ముందు ఇచ్చారు గురూజీ త్రివిక్రమ్.. డిజాస్టర్ అజ్ఙాతవాసి. సంక్రాంతికి థియేటర్లలో షోలు కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చేంత డిజాస్టర్. అది కూడా హారిక హాసిని బ్యానర్ నుంచే.
విపరీతమైన బజ్ తో వచ్చింది. అనిరుధ్ సంగీతం. అత్తారింటికి దారేది సక్సెస్ తెచ్చిన బజ్. ఆ విధంగా ఆ సినిమా కథ ముగిసింది. ఆ ఏడాదే ఎన్నికలు జరిగాయి జగన్ సీఎంగా భారీ మెజారిటీతో గెలిచారు.
2024.. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి గురూజీ త్రివిక్రమ్.. మరో ఫెయిల్యూర్ అందించారు. అది కూడా హారిక హాసిని బ్యానర్ నే. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ ఇచ్చిన బజ్. కానీ మళ్లీ మరో ఫెయిల్యూర్. చిన్న సినిమా హనుమాన్ కన్నా వెనుకబడిపోయింది.
మరి ఈ సారి ఎన్నికల్లో ఎవర్ని వన్ సైడ్ భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారో? గురూజీ సెంటిమెంట్ తో?