నేనే కింగ్.. ఓపెన్ గా చెప్పిన చిరంజీవి

రికార్డులు, సక్సెస్ పరంగా 'నేనే నంబర్ వన్' అని ఎవ్వరూ క్లెయిమ్ చేసుకోరు. ఎందుకంటే అది చాలా చర్చకు దారితీస్తుంది. వసూళ్ల లెక్కలు బయటకొస్తాయి. అందుకే హీరోలెవ్వరూ వాటి జోలికి పోరు. తాము తెరవెనక…

రికార్డులు, సక్సెస్ పరంగా 'నేనే నంబర్ వన్' అని ఎవ్వరూ క్లెయిమ్ చేసుకోరు. ఎందుకంటే అది చాలా చర్చకు దారితీస్తుంది. వసూళ్ల లెక్కలు బయటకొస్తాయి. అందుకే హీరోలెవ్వరూ వాటి జోలికి పోరు. తాము తెరవెనక ఉండి, అభిమాన సంఘాలతో ఆ పని కానిస్తుంటారు. అయితే ఒక విషయంలో మాత్రం చిరంజీవి తనకుతాను నంబర్ వన్ స్టేటస్ ఇచ్చుకున్నారు.

డాన్స్ లో తన తర్వాతే ఎవరైనా అని చెప్పుకున్నారు చిరు. ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. యంగ్ హీరోల్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు తను తగ్గుతుంటానని చెప్పుకొచ్చారు.

“నా పేరు శివశంకర వరప్రసాద్. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. శివుడి ముందు ఎవరైనా డాన్స్ వేయగలరా? చాలామంది తాము డాన్స్ చేస్తున్నామని అనుకుంటారు. కానీ ఎవరైనా శివుడి తర్వాతే. ఆ శివతాండవం తర్వాతే ఎవరైనా. అయితే అప్పుడప్పుడు మిగతా హీరోల్ని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి, నేను కావాలని తగ్గుతాను. కాబట్టి వాళ్లు ఎదుగుతున్నారు.”

ఇలా డాన్స్ లో తనే రారాజు అనే విషయాన్ని చిరంజీవి చెప్పకనే చెప్పారు. కేవలం రామ్ చరణ్ లాంటి హీరోల కోసం తను అప్పుడప్పుడు తగ్గుతుంటానని అన్నారు.

ఆచార్య సినిమాలో ఓ పాటలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డాన్స్ చేశారు. ఆ సాంగ్ లో తండ్రి చిరంజీవితో కలిసి డాన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డానని చెప్పిన చరణ్, డాన్స్ లో ఎప్పటికీ చిరంజీవే నంబర్ వన్ అన్నాడు.