ఆఖరి 20 నిమిషాలు.. అదుర్స్

ఏ సినిమాకు అయినా క్లైమాక్స్ కీలకం. సినిమా అంతా ఎలా వున్నా క్లైమాక్స్ బాగుండి ఆడేసిన సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా వున్నాయి. పైగా మేకర్లు కూడా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్,…

ఏ సినిమాకు అయినా క్లైమాక్స్ కీలకం. సినిమా అంతా ఎలా వున్నా క్లైమాక్స్ బాగుండి ఆడేసిన సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా వున్నాయి. పైగా మేకర్లు కూడా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బాగా వుండాలని చూస్తారు. సినిమా టాక్ దాని మీదే ఆధారపడి వుంటుందని భావిస్తారు.

పండగకు విడుదలవుతున్న నాలుగు సినిమాల క్లైమాక్స్ ల గురించి మంచి టాక్ లే వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం. సినిమా మొత్తం ఒక ఎత్తు. చివరి ఇరవై నిమిషాలు తల్లీ కొడుకుల మధ్య నడిచే భావోద్వేగాల సన్నివేశాలు మరొక ఎత్తు అంటూ టాక్ వినిపిస్తోంది. రావు రమేష్- మహేష్ బాబు- రమ్య కృష్ణల నడుమ ఈ సన్నివేశాలు వుంటాయని వినిపిస్తోంది.

హనుమాన్.. చివరి ఇరవై నిమిషాలు సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఈ ఇరవై నిమిషాలు హనుమన్ భక్తులకు పూనకాలే అని టాక్. ఈ సీన్ లో హనుమాన్ గా ఏ నటుడు కనిపిస్తాడు అన్నది గోప్యంగా వుంచారు.

నా సామి రంగా.. సినిమా మొత్తం మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నడిచినా, చివరి 20 నిమిషాలు హెవీ ఎమోషన్ గా వుంటుందని తెలుస్తోంది. ఈ ఇరవై నిమిషాలు చాలా హైగా వుంటుందని టాక్.

సైంధవ్.. ఈ సినిమా లో చివరి ఇరవై నిమిషాలు హైలైట్ అని దర్శకుడు శైలేష్ కొలను గట్టిగా చెబుతూ వస్తున్నారు. హీరో వెంకటేష్ విశ్వరూపం చూపించేస్తారంటున్నారు.

మొత్తం మీద పండగకు వస్తున్న నాలుగు సినిమాలు కూడా చివరి ఇరవై నిమిషాల మీద గట్టిగా ఆధారపడినట్లు కనిపిస్తోంది.