విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అనసూయ మధ్య ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో జరిగిన వార్ గురించి అందరికీ తెలిసిందే. ఒక దశలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హద్దుమీరి కామెంట్స్ పెట్టారు. అయితే అనసూయ కూడా అదే రేంజ్ లో ప్రతిస్పందించింది. ఇలా చాన్నాళ్ల పాటు నడిచిన ఈ సోషల్ మీడియా వార్ నుంచి అనసూయ స్వచ్ఛందంగా తప్పుకుంది. తనకు మానసిక ప్రశాంతత కావాలని అందుకే ఇకపై ఆ వివాదాన్ని కొనసాగించనని కూడా మీడియాముఖంగా ప్రకటించింది అనసూయ.
ఓవైపు ఇంత జరిగితే, మరోవైపు అసలేం జరిగిందో తనకు తెలియదంటున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. కేవలం ఓవైపు నుంచి వచ్చిన కామెంట్స్ మాత్రమే తనకు తెలుసని, మెయిన్ ఇష్యూ ఏంటనేది తనకు ఇప్పటికీ అర్థంకాలేదంటూ అమాయకంగా స్పందించాడు.
“అన్నయ్య విజయ్ దేవరకొండకు, అనసూయకు మధ్య ఇష్యూ ఏం లేదు. ఇదంతా ఓవైపు నుంచి జరిగిన కామెంటరీ మాత్రమే. అంతకుమించి వాళ్లిద్దరి మధ్య జరిగింది ఏంటనేది నేను చెప్పలేను. ఇంకా చెప్పాలంటే, వాళ్లిద్దరి మధ్య ఇష్యూ ఏంటనేది కూడా నాకు పెద్దగా తెలియదు.”
ఇలాంటి ఆవేశాలకు, కోపతాపాలకు సోషల్ మీడియానే కారణం అంటున్నాడు ఆనంద్. “రియల్ లైఫ్ లో ఒకడ్ని రోడ్డుపై చూసి మనం కామెంట్ చేయం. అలాంటి పేరు ఎందుకు పెట్టుకున్నావ్ అని కామెంట్ చేయం. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఆ పేరుపై కామెంట్ చేస్తాం. సోషల్ మీడియా అనేది అతిపెద్ద సైకలాజికల్ ప్రయోగశాలగా మారింది. మనకు తెలియకుండానే అందరం అందులో చేరిపోయాం.” అంటూ రియాక్ట్ అయ్యాడు.
విజయ్ దేవరకొండతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత, ఆనంద్ దేవరకొండ నటించిన బేబి సినిమాను మెచ్చుకుంది అనసూయ. బేబి సినిమా ట్రయిలర్ చాలా బాగుందని, ఆనంద్ దేవరకొండ చాలా ఇంటెన్స్ గా కనిపించాడని మెచ్చుకుంది. అనసూయ ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేశాడు ఆనంద్. తనకు ఇప్పటివరకు థియేట్రికల్ సక్సెస్ లేదని, ఆ కిక్ ఎలా ఉంటుందో బేబి సినిమాతో ఎక్స్ పీరియన్స్ చేయాలని ఉందంటున్నాడు.