నయనతార.. జవాన్ సినిమాలో షారూక్ సరసన హీరోయిన్ ఈమె. ఇక రియల్ లైఫ్ లో విఘ్నేష్ శివన్ భార్య. ఇప్పుడీ స్టార్ హీరోయిన్ పై ఇటు షారూక్, అటు విఘ్నేష్ జాయింట్ గా జోకులేశారు. విఘ్నేష్ ట్వీట్ తో ఇదంతా మొదలైంది.
ముందుగా విఘ్నేష్ ఓ ట్వీట్ పెట్టాడు. కింగ్ ఖాన్ షారూక్ తో నటించాలనే నయనతార చిరకాల కోరిక తీరినందుకు ఆమెకు కంగ్రాట్స్ చెప్పాడు. అదే టైమ్ లో షారూక్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు.
విఘ్నేష్ ట్వీట్ కు షారూక్ రిప్లయ్ ఇచ్చాడు. నయనతార చాలా చక్కగా చేసిందని మెచ్చుకుంటూనే, సినిమా కోసం ఆమె కొన్ని ఫైట్లు, పంచ్ లు నేర్చుకుందని.. కొంచెం జాగ్రత్తగా ఉండాలని విఘ్నేష్ కు సూచించాడు.
దీనికి వెంటనే విఘ్నేష్ స్పందించాడు. ఇకపై నయనతారతో జాగ్రత్తగా ఉంటానని జోక్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. సినిమా కోసం నయనతార ఫైట్లు మాత్రమే నేర్చుకోలేదని, కింగ్ ఆఫ్ రొమాన్స్ అయిన షారూక్ నుంచి ఆమె రొమాన్స్ కూడా నేర్చుకుందని పోస్ట్ పెట్టాడు. సినిమాలో మీ ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ ఉందని విన్నానంటూ స్పందించాడు.
విఘ్నేష్ పోస్టు చూసి చాలామంది అతడ్ని మెచ్చుకుంటున్నారు. ఇంతలా సపోర్ట్ చేసే భర్త దొరకడం నయనతార అదృష్టం అంటూ కామెంట్స్ పడుతున్నాయి.