బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు. ఆగస్ట్ 18న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత అప్పిరెడ్డి అనౌన్స్ చేసారు.
ఈ సినిమాకు దర్శకుడు శ్రీనివాస్ వంజనంపాటి. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో హీరో సోహైల్ ప్రెగ్నెంట్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ రూప చేతిలో అల్ట్రాసౌండ్ పిక్చర్ పట్టుకుని, ఫుల్ హ్యాపీ, ఎగ్జైటెడ్ మూడ్ లో కనిపించింది.
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తయారవుతోందీ సినిమా. ఏదో ఒక కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ వుంటే తప్ప జనం థియేటర్ కు రావడం లేదు. ఈ సినిమాను అలాంటి నావెల్ కాన్సెప్ట్ తో తయారు చేస్తున్నట్లు ఇప్పటి వరకు వదిలిన ప్రమోషన్ కంటెంట్ క్లారిటీ ఇస్తోంది.
సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, ఆలీ, హర్ష తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అటు ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఇటు యూత్ ఫుల్ ఫన్ కూడా సినిమాలో సమపాళ్లలో వుంటుందని దర్శకుడు చెబుతున్నారు.