ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హంబోలే సంస్థ నిర్మిస్తున్న సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు ఈ సినిమా మీద. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులే దాదాపు 180 కోట్ల వరకు చెబుతున్నారు. కనీసం 170 కోట్ల మేరకు వస్తాయని ఆశిస్తున్నారు.
నిజానికి ఈ సంస్థ గత బ్లాక్ బస్టర్లు కేజిఎఫ్ 2, కాంతారా అమ్మలేదు. అడ్వాన్స్ లు కూడా లేకుండా కేవలం నామినల్ కమిషన్ పద్దతిన పంపిణీకి ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు. ఎందుకు? అన్నది అనుమానాలు రెకెత్తించింది.
కానీ అసలు విషయం వేరు అని తెలుస్తోంది ఓటిటి సంస్థలు ఈ మధ్య భారీ సినిమాలు భారీ రేట్లకు కొని దెబ్బతిన్నాయి. అందువల్ల 125 కోట్లు దాటిన సినిమాలు కొనకూడదని ఓటిటి సంస్థలు ఇంటర్నల్ గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏ సినిమా అయినా మాగ్జిమమ్ పెట్టుబడి 125 కోట్ల వరకే అన్నది ఓటిటి సంస్థలు గీసుకున్న లక్ష్మణ రేఖ. దాంతో ఇప్పుడు సలార్ అమ్మకం ఆగినట్లు తెలుస్తోంది.
అందుకే పెట్టుబడిని తట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల హక్కులు అమ్మేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు బోగట్టా. అంతే కాదు, సలార్, ప్రాజెక్ట్ కె ఇలాంటి సినిమాలు అన్నీ రెండు భాగాలు కావడం వెనుక కూడా ఓటిటి సంస్థలు 125 కోట్లకు మించి పెట్టకూడదని డిసైడ్ కావడం కూడా వుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది.