సీనియర్ మంత్రిని ఢీ కొంటున్న జూనియర్ నేత

శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో రసవత్తరమైన పోటీ ఈసారి ఈసారి జరగబోతోంది. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే రాజకీయంగా నాలుగు దశాబ్దాల కాలంగా ఉంటూ తలపండిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ తరఫున పోటీ…

శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో రసవత్తరమైన పోటీ ఈసారి ఈసారి జరగబోతోంది. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే రాజకీయంగా నాలుగు దశాబ్దాల కాలంగా ఉంటూ తలపండిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు ఇది ఎనిమిదవ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇప్పటికి అయిదు సార్లు గెలిచారు. అనేక ముఖ్య శాఖలను మంత్రిగా చూసారు

ఆయన మీద ఎప్పుడూ ప్రత్యర్ధులుగా సీనియర్ నేతలు నిలబడుతూ వస్తున్నారు. దాంతో పోటీ గట్టిగా ఉంటూ వచ్చింది. ఈసారి మాత్రం రాజకీయంగా తన జాతకాన్ని మార్చుకునేందుకు యువ నేత టీడీపీ నాయకుడు గొండు శంకర్ పోటీ చేస్తున్నారు. శంకర్ అనుభవం సర్పంచ్ గా ఉంది.

ఆయన తెలుగుదేశంలో ఎదుగుతున్న నేత. ఆయనకు ఈసారి టికెట్ ఇచ్చి కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. దశాబ్దాల అనుభవం కలిగిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని పక్కన పెట్తి మరీ శంకర్ కి టికెట్ ఇస్తోంది.

తాను శీనియర్ మంత్రి మీద విజయం సాధిస్తాను అని శంకర్ అంటున్నారు. అయితే ఆయనకు గుండ కుటుంబం మద్దతు ఇక్కడ కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో ఆ కుటుంబం వెంట మెజారిటీ టీడీపీ ఉంది. దాంతో గుండ దంపతులను తనకు తల్లిదండ్రులుగా శంకర్ చెప్పుకుంటున్నారు. వారి ఆశీర్వాదాలు కావాలని ఆయన కోరుకుంటున్నారు.

శంకర్ తో పోటీ సీనియర్ మంత్రి ధర్మానకు తేలిక అవుతుందా లేక కష్టతరం అవుతుందా అంటే ఇప్పటికైతే సేఫ్ జోన్ లోనే మంత్రి ఉన్నారని అంటున్నారు. టీడీపీలో వర్గ పోరు మంత్రికి కలసి వస్తోంది. గుండ దంపతులు మనసు మార్చుకుని పూర్తి స్థాయిలో శంకర్ కి మద్దతు ఇస్తే ఏమైనా మార్పు కనిపించవచ్చు. అయితే గుండ దంపతులు తగ్గినా వారి అనుచరులు క్యాడర్ తగ్గకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది.

ఎలా చూసుకున్నా సైకిల్ పార్టీకి శ్రీకాకుళం సీటు బ్రేకులు వేసేలా ఉంది అని అంటున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటు రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇక్కడ నుంచి టీడీపీ ఆరు సార్లు గెలిచింది. కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. వైసీపీ ఒకసారి గెలిచింది. ఇండిపెండెంట్లు మూడు సార్లు గెలిచిన సీటు కూడా ఇదే.

ఈ సీటు విషయంలో వైసీపీ ధీమాగా ఉంది. ధర్మానకు వరసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. 2004, 2009లలో ఆయన ఇదే సీటు నుంచి గెలిచారు. ఇపుడు అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేస్తాను అని అంటున్నారు. ధర్మాన అంటే వ్యూహాల పుట్ట అని చెబుతారు. శంకర్ యువ నేత, దూకుడుగా రాజకీయం చేస్తారు. దాంతో ఈ సీటు ఫలితం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.