లవ్ ‘టూ’…మ్యారీ ‘టూ’

పక్కా పైసా వసూల్ మాస్ సినిమాలా కనిపిస్తోంది. కే ఆర్ కే సినిమా. పేరుకు డబ్బింగ్ సినిమానే కానీ స్టార్ట్ కాస్ట్ మాత్రం మన ప్రేక్షకులకు బాగా నచ్చేదే. విజయ్ సేతుపతి, సమంత, నయనతార.…

పక్కా పైసా వసూల్ మాస్ సినిమాలా కనిపిస్తోంది. కే ఆర్ కే సినిమా. పేరుకు డబ్బింగ్ సినిమానే కానీ స్టార్ట్ కాస్ట్ మాత్రం మన ప్రేక్షకులకు బాగా నచ్చేదే. విజయ్ సేతుపతి, సమంత, నయనతార. ఇద్దరు అమ్మాయిలు..ఒకడే ప్రియుడు..ఫుల్ మాస్ రొమాస్న్ జానర్ అన్నమాట.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. విజయ్ సేతుపతి ఇన్నోసెంట్ లుక్స్, నయన్..సమంత ల గ్లామర్ మీదనే ఆధారపడి సినిమా మొత్తం ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇరువురి భామల కౌగిలిలో ఇరుకున పడి నీవు నలిగితివా అన్న సాంగ్ టైపులో వుంది ట్రయిలర్ మొత్తం. 

ఈ ప్రియురాలు కాఫీ..ఆ ప్రియురాలు టీ తెస్తే, రెండూ కలిపి, కళ్లకు అద్దుకుని మరీ తాగేసే ఇన్నోసెంట్ ప్రియుడిగా విజయ్ సేతుపతి కనిపించాడు. ఒక ప్రియురాలు లెంపకాయ కొడితే మరి మీరో అరి రెండో ప్రియురాలిని అడిగి మరీ కొట్టించుకున్నాడు. 

పక్కా బి, సి సెంటర్లలో వర్కవుట్ అయ్యే ఫన్ ఎలిమెంట్స్ అన్నీ జోడించారు. తమిళ వెర్షన్ తో సమానంగా ఈనెల 28న విడుదలయ్యే ఈ సినిమా తెలుగు వెర్షన్ కు నిర్మాత గాయత్రీ సతీష్. అనిరుధ్ సంగీత దర్శకుడు.