బుల్లెట్ మీద ఉస్తాద్ రామ్

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ సినిమా వారియర్. ఈ సినిమా నుంచి బుల్లెట్ లాంటి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు అన్నీ స్పెషల్సే… క్రేజీ హీరోయిన్ కీర్తి శెట్టి డ్యాన్స్, రాక్ స్టార్ దేవీ మ్యూజిక్,…

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ సినిమా వారియర్. ఈ సినిమా నుంచి బుల్లెట్ లాంటి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు అన్నీ స్పెషల్సే… క్రేజీ హీరోయిన్ కీర్తి శెట్టి డ్యాన్స్, రాక్ స్టార్ దేవీ మ్యూజిక్, తమిళ హీరో శింబు గాత్రం ఇవన్నీ స్పెషల్ పాయింట్లు అయితే ఇస్మార్ట్ రామ్ మాస్ డ్యాన్స్ యాడెడ్ అడ్వాంటేజ్. శ్రీమణి రాసిన లిరిక్స్ క్యాచీగా, కాంటెంపరీరీ గా వున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ ముందు తరువాత కూడా రామ్ తన స్టెప్స్ విషయంలో కీలకంగానే వుంటారు. ఈ పాటకు కూడా కాస్త డిఫెరంట్ గా డ్యాన్స్ చేయాలని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. కీర్తి శెట్టి అవుట్ అండ్ అవుట్ గ్లామర్ డాల్ గా కనిపించింది. పాట వీడియో ఫైల్ ప్రెజెంటేషన్ బాగుంది. 

దేవీశ్రీప్రసాద్ ట్యూన్ బాగానేవుంది కానీ కొత్తగా ట్రయ్ చేయలేకపోతున్నాడు. ఏది విన్నా ఎప్పుడొ విన్నట్లు, ఎక్కడో విన్నట్లుగానే వుంటున్నాయి. ఆయన ఎప్పటికి ఇది గ్రహించి మారతారో మరి. లేదా క్యాచీ ట్యూన్ లు అంటే ఇచ్చిన స్టయిల్ లోనే మళ్లీ ఇవ్వడం అని ఫిక్స్ అయిపోయారో?

లింగు స్వామి డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమాకు చిట్టూరి శ్రీనివాస్ నిర్మాత.