వీళ్లెవ్వరూ కేజిఎఫ్ 2 చూడలేదా?

కేజిఎఫ్ 2 ఓ సంచలనం. హిందీ నాట ఆర్ఆర్ఆర్ ను పక్కకు తోసేసిన వైనం. తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ను సింపుల్ గా ఊదేసిన సినిమా. అలాంటి సినిమా…

కేజిఎఫ్ 2 ఓ సంచలనం. హిందీ నాట ఆర్ఆర్ఆర్ ను పక్కకు తోసేసిన వైనం. తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ను సింపుల్ గా ఊదేసిన సినిమా. అలాంటి సినిమా గురించి ఆలస్యంగా అయినా అల్లు అర్జున్ ట్వీట్ వేసారు. యూనిట్ ను, కీలక వ్యక్తులను పొగడ్తలతో ముంచెత్తారు. 

ఆలస్యం అన్నది బన్నీకి అలవాటే. అందరూ హడావుడి చేసే టైమ్ లో ఆయన సైలంట్ గా వుంటారు. అందరూ అయిపోయాక ఆయన లైన్ లోకి వస్తారు. అప్పుడు అందరి ఫోకస్ బన్నీ మీదే వుంటుంది. అదీ ఆయన స్టయిల్.

సరే, ఈ సంగతి అలా వుంచితే మిగిలిన హీరోలు, టాలీవుడ్ సెలబ్రిటీల సంగతేమిటి? మన సినిమాను అందరూ పొగడాలి. మనం మాత్రం మన ఆబ్లిగేషన్లు, మన సంబంధాలు, మన స్నేహాలు చూసుకునే ట్వీట్ లు వేస్తాం. పొగడ్తలతో ముంచెత్తుతాం.  మన హీరోలు, సెలబ్రిటీలు కేజిఎఫ్ 2 చూడలేదు అని అనుకోవడానికి లేదు. తొలి రోజు తొలి ఆటకే ఐమాక్స్ , ఎఎమ్ మి మాల్ కు పరుగెత్తే వారు చాలా మందే వున్నారు. 

కానీ ఎవ్వరికీ ట్వీట్ వేసేంత ఉదార హృదయం లేదు. సినిమా ఇలా కాగానే ధైర్యంగా సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ వేసింది దర్శకుడు మారుతి మాత్రమే. నిజాయతీగా, నికార్సుగా ట్వీట్ వేసారు ఆయన. మిగిలిన వారంతా సైలెన్స్.

అదే ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే పోటీలు పడిపోయారు. భజన తాళాలు పట్టుకుని ఒకటే భజన. పాన్ ఇండియా కు మనం ఎయిమ్ చేసినపుడు, మన దగ్గరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాను కూడా అక్కున చేర్చుకోవాలి కదా? మనం పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లామని గర్వంగా చెప్పుకుంటారు. కానీ మరో సినిమా పోటీకి వస్తే ప్రాంతీయ వాదాన్ని బయటకు తీసి, తెలుగు సినిమా, తెలుగువాడు అంటూ కొత్త పాయింట్ బయటకు లాగుతారు.

ఏమిటో ఈ సినిమా జనాలు.