ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది ఈ భారీ బడ్జెట్ సినిమా. ప్రభాస్ ఎప్పుడు తెరపై కనిపిస్తాడా.. పేపర్లు ఎగరేద్దాం.. ఈలలతో దంచేద్దాం.. అరుపులతో పిచ్చెక్కిద్దామని అంతా ఎదురుచూసే టైమ్ రానే వచ్చింది.
అయితే ఇలాంటి బ్యాచ్ అంతా సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా సేపు ఆపుకోవాల్సి ఉంటుంది. అవును.. కల్కి సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలాసేపటి వరకు ప్రభాస్ రాడు. ఇంకా చెప్పాలంటే సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాతే ప్రభాస్ కనిపిస్తాడు.
కల్కి చాలా పెద్ద కథ. ఎక్కువ పాత్రలున్న స్టోరీ. ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ, కథను ముందుకు తీసుకెళ్లడానికి దాదాపు 20-22 నిమిషాలు టైమ్ తీసుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత మాత్రమే భైరవ పాత్ర ఎంటర్ అవుతుంది.
ఎప్పుడైతే భైరవ పాత్ర అడుగుపెడుతుందో, అక్కడ్నుంచి సినిమా పరుగులు పెడుతుందట. ఇక సెకండాఫ్ అయితే గుక్కతిప్పుకోకుండా ఉంటుందంటున్నాడు నాగ్ అశ్విన్.
రిలీజ్ కు సరిగ్గా కొన్ని గంటల ముందు ఇందులో అతిథి పాత్రలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని ఇందులో కీలక పాత్రలు పోషించినట్టు అధికారికంగా ప్రకటించారు. హీరో ప్రభాస్ వీళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపాడు.