షాకింగ్.. హీరో దర్శన్ కేసులో మరో కొత్త కోణం

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు దర్శన్. ఇప్పుడీ కేసుకు సంబంధించి…

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు దర్శన్. ఇప్పుడీ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దర్శన్ దగ్గర 2 తుపాకులున్నాయట. అమెరికాలో తయారుచేసిన గన్స్ అవి. వాటికి లైసెన్స్ కూడా ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాటిని దర్శన్, పోలీసులకు స్వాధీనం చేయలేదు.

బెంగళూరులో 7830 మందికి గన్ లైసెన్స్ ఉంది. నిబంధనల ప్రకారం, ఎన్నికల సమయంలో వీళ్లంతా తమ తుపాకుల్ని తమ పరిథి పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, కొంతమంది వ్యాపారవేత్తలకు ఇలాంటి సమయాల్లో ప్రత్యేక అనుమతులిస్తారు. వాళ్లు తమ గన్స్ ను డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు.

అలా ఎన్నికల టైమ్ లో 277 మంది తన తుపాకుల్ని పోలీసులకు సరెండర్ చేయలేదు. ఆ 277 మందిలో దర్శన్, అతడి సహచరుడు ప్రదోష్ కూడా ఉన్నారు. ఇతడికి ఎందుకు అంత ప్రత్యేకమైన అనుమతి ఇచ్చారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పైగా ఇందులో మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, దర్శన్ కేసును కొలిక్కి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన బి.దయానంద అనే పోలీస్ ఉన్నతాధికారే, దర్శన్ కు ఈ ‘ప్రత్యేక వెసులుబాటు’ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తుపాకుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

ప్రస్తుతానికి రేణుకాస్వామి హత్యకు, ఈ తుపాకులకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. విచారణ కీలక దశలో ఉన్న సమయంలో వాటిని స్వాధీనం చేసుకోవడమే ఉత్తమమని పోలీసులు భావిస్తున్నారు. పైగా బుల్లెట్స్ లెక్క సరిపోయిందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు.