మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన నాగ్ హీరోయిన్

హీరోయిన్ అషికా రంగనాధ్ దూసుకుపోతోంది. వరుసపెట్టి క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె మరో ఆసక్తికర సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అదే సర్దార్-2. Advertisement కార్తి హీరోగా నటించిన సర్దార్…

హీరోయిన్ అషికా రంగనాధ్ దూసుకుపోతోంది. వరుసపెట్టి క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె మరో ఆసక్తికర సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అదే సర్దార్-2.

కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా పెద్ద హిట్టయింది. అందులో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు కార్తి. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రాబోతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది అషికా రంగనాధ్. తొలి భాగంలో రాశిఖన్నా నటించింది.

రీసెంట్ గా వరుసగా సినిమాలకు కమిట్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సిద్దార్థ్ సరసన ‘మిస్ యు’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇప్పుడు కార్తి సినిమాకు కూడా ఎంపికైంది.

కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. ఆ సినిమా ఫ్లాప్ తో డీలా పడింది. గ్యాప్ కూడా వచ్చేసింది. నాగ్ సరసన చేసిన ‘నా సామిరంగ’ సినిమా, ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పట్నుంచి వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తూనే ఉంది.