వరుసగా తగిలిన సెట్ బ్యాక్ ల నుంచి తేరుకుని, చకచకా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు హీరో వరుణ్ తేజ్. మట్కా సినిమా సెట్ మీద వుండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పాడు. వీటిలో ఒకటి కాస్త ఆసక్తికరమైన సినిమా.
అమెరికా బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ. అంతే అయితే ఆసక్తి ఏముంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అన్నది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. దాని నేపథ్యంలోనే ఈ కథ అమెరికాలో నడుస్తుందని తెలుస్తోంది.
గతంలో రవితేజ తో టచ్ చేసి చూడు అనే సినిమా తీసిన దర్శకుడే ఈ సినిమాకు పని చేస్తారు. ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అంటున్నారు కానీ, మరి కొన్ని ఎలిమెంట్స్ కూడా వున్నాయని తెలుస్తోంది.
ఇదిలా వుంటే యువి సంస్థ దగ్గర వుండే మేర్లపాక గాంధీతో ఓ సినిమా సెట్ అయింది. అదే సంస్థ నిర్మిస్తుంది. మట్కా తరువాత మైత్రీ మూవీస్ సినిమా వుంటుంది. ఆ తరువాత మేర్లపాట గాంధీ సినిమా వుంటుంది.