కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కామన్ పాయింట్ అయింది. పరిశ్రమలతో సంబంధం లేకుండా, ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులున్నారు. కొంతమంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెడితే, మరికొంతమంది మాత్రం తమకు అలాంటివేం జరగలేదని చెప్పుకుంటున్నారు. కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఇషా కొప్పికర్ కూడా చేరింది.
ఓ పెద్ద హీరో తనను ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచాడంటూ బాంబ్ పేల్చింది ఇషా. అప్పుడు తనకు 22 ఏళ్లు ఉంటాయని, కెరీర్ స్టార్టింగ్ లోనే తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని తెలిపింది.
“అప్పుడు నాకు 22-23 ఏళ్లు ఉంటాయి. ఓ పెద్ద నటుడు నన్ను ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు. అప్పటికే అతడికి కొన్ని ఎఫైర్లు ఉన్నాయి. తనపై ఇప్పటికే కొన్ని వివాదాలున్నాయని, స్టాఫ్ వస్తే పుకార్లు పుట్టిస్తారని, అందుకే ఒంటరిగా రావాలని అతడు కోరాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఒంటరిగా రాలేనని చెప్పేశాను.”
అతడి పేరు వెల్లడించిన ఇషా కొప్పికర్, బాలీవుడ్ కు చెందిన టాప్ హీరోల్లో ఒకడని మాత్రం చెప్పుకొచ్చింది. అలాంటిదే మరో అనుభవం 18 ఏళ్ల వయసులో తనకు ఎదురైందని తెలిపింది.
“హీరో సెక్రటరీ నా దగ్గరకొచ్చింది. హీరోతో కాస్త ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పింది. నేను ఫ్లెండ్లీగానే ఉంటానన్నాను. నిన్ను ఎవరైనా అభ్యంతరకరంగా తాకారా అని అడిగింది. లేదని చెప్పాను. హీరో అలా తాకినా కూడా సర్దుకోవాలి అని చెప్పింది.”
అలాంటి ‘ఫ్రెండ్లీ’ నేచర్ తనకు లేదని సెక్రటరీ మొహం మీదే చెప్పేసిందట ఇషా కొప్పికర్. బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు, సౌత్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. 2009లో బాయ్ ఫ్రెండ్ టిమ్మీ నారంగ్ ను పెళ్లి చేసుకుంది. అయితే అభిప్రాయబేధాలొచ్చి ఈ ఏడాది విడిపోయారు.