రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం టైంలో రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు. అందులో కొంత మంది వాడు గెలిస్తే నేను చెవి కోసుకుంటా.. ముక్కు కోసుకుంటా.. రాజకీయ సన్యాసం చేస్తా.. ఆ పార్టీ గెలిస్తే దేశంలోని ఉండనంటూ శపదాలు చేస్తుంటారు. అందులో మాట మీద నిలబడే నాయకులు ఒక్క శాతం కూడా ఉంటారు అనేది మనకు తెలిసిన నిజం. కాకపోతే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాత్రం తాను చేసిన వాగ్దానానికి కట్టుబడి తన పేరు మార్చుకున్నారు. ఛాలెంజ్ చేసినట్టుగానే తన పేరును ‘‘పద్మనాభ రెడ్డి’’గా ఛేంజ్ చేసుకున్నారు.
ముద్రగడ పేరు మార్చుకోవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్లు పెడుతున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు వైసీపీ వాళ్ళు మాత్రం ముద్రగడ నిజమైన కాపు అని అందుకే మాట మీద నిలబడ్డాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇతర నాయకులు చెప్పినవి పాటించరని కానీ మా నేత మాత్రం మాట ఇచ్చినట్లు గానే పేరు మార్చుకున్నారంటూ క్లారిటీ ఇస్తున్నారు.
కాగా ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే పేరు మార్చుకుంటా అని చెప్పడంతో పిఠాపురంలో పవన్ గెలవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న జనసేన అభిమానులు ముద్రగడను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ముద్రగడ పేరు మార్చుకోవడంతో ఇకపై నుండి ముద్రగడను పవన్ అభిమానులు టార్గెట్ చేస్తారా? లేదా?అనేది చూడాలి.
2019 ఎన్నికల ముందు కొంత మంది నాయకులు ఇక సినిమాలు చేయను.. పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తా.. మరో నాయకుడు ఆ పార్టీ గెలిస్తే చెవి కొసుకుంటా.. అని చెప్పిన వారు మాట మీద నిలబడలేదు. కానీ కాపు ఉద్యమ నేత మాత్రం తను చెప్పినట్లు చేసి చూపించడం విశేషం.