వైసీపీకి క్రెడిటేనా?

విశాఖలోని రుషికొండ భవనాలు అద్భతం అని అంతా ఒప్పుకుంటున్నారు. రాజ ప్రసాదాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ రుషికొండ భవనాలు చూస్తే అవేనా అని అనుకోవాల్సి ఉంటుదని అంటున్నారు. విశాఖని సిటీ ఆఫ్ బ్యూటీ…

విశాఖలోని రుషికొండ భవనాలు అద్భతం అని అంతా ఒప్పుకుంటున్నారు. రాజ ప్రసాదాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ రుషికొండ భవనాలు చూస్తే అవేనా అని అనుకోవాల్సి ఉంటుదని అంటున్నారు. విశాఖని సిటీ ఆఫ్ బ్యూటీ అని అంటారు. అంతటి ఘనమైన సిటీకి తలనామికంగా రుషికొండ భవనాలు ఉన్నాయని అంటున్నారు.

ఇపుడు డ్రోన్ల ద్వారా మొత్తం రుషికొండ భవనాలను విజువలైజ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ భవనాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడుతోంది. అయిదు వందల కోట్లతో వైసీపీ ప్రభుత్వం ఈ అద్భుత కట్టడాలని రూపొందించింది అని వైసీపీ నేతలు అంటున్నారు.

మొదట జగన్ సొంత ప్రయోజనాల కోసం జల్సా చేయడానికి వీటిని కట్టారు అని టీడీపీ సహా రాజకీయ పక్షాలు విమర్శలు చేసినా అందులో వాస్తవం లేదు అని తెలిసింది అంటున్నారు. జగన్ అసలు ఈ భవనాలను చూడనే లేదు. అక్కడ అడుగు పెట్టనే లేదు. పైగా అవి ప్రభుత్వ స్థలంలో నిర్మించినవి. ప్రభుత్వానికే చెందుతాయని సగటు జనానికి పూర్తిగా తెలుసు.

అందుకే ఈ రకమైన విమర్శలు బూమరాంగ్ అయ్యాయి. అంతే కాదు బహు చక్కని భవనాలు విశాఖలో నిర్మించారు అన్న క్రెడిట్ కూడా వైసీపీకి వెళ్తోంది అని అంటున్నారు. దీంతో ఈ భవనాలను చూపించిన తరువాత టీడీపీ మీద వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. అవును మేము అద్భుతమైన కట్టడాలనే కట్టాం, విశాఖను విశ్వనగరంగా చేద్దామనుకున్నాం అని అంటున్నారు. తాము భవనాలు కడితే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ అని వైసీపీ నేతలు క్రెడిట్ ని క్లెయిం చేసుకుంటున్నాయి.

ఈ భవనాలను సంబంధించిన ఫోటోలను విడుదల చేయడం ద్వారా అనవసరంగా వైసీపీకి క్రెడిట్ ఆపాదించినట్లు అయింది అని అంటున్నారు. ఈ భవనాలను టూరిజం కోసమే వాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కూడా వీటిని ఉపయోగించేలా చూడవచ్చు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తే విశాఖకు ఈ భవనాలు రానున్న కాలంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నాయని అంటున్నారు.