హీరో నాని ఖాళీగా వుండరు. సినిమా మీద సినిమా ఎక్కిస్తూనే వుంటారు. సరిపోదా శనివారం టైమ్ లోనే బలగం వేణు, దసరా శ్రీకాంత్ ల కథలు రెండూ విని రెడీ చేసి వుంచుకున్నారు. కానీ రెండింటి పాత్రల్లో కొంత సిమిలారిటీనో, లేదా కథలో కామన్ పాయింట్ నో వుండడంతో, ఒకటి పక్కన పెట్టి, రెండోది ఎంచుకున్నారు.
దసరా దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ కావాలంటే రెండు మూడు నెలలు పడుతుంది. ఈ గ్యాప్ ఎందుకు వదిలేయాలి, ఆ గ్యాప్ ను మరి కొంచెం పెంచి ఓ సినిమా చేసేస్తే ఎలా వుంటుంది అనే ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
అలా చేయాలంటే బౌండ్ స్క్రిప్ట్ కావాలి. నాని దగ్గర హిట్ 3 బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుంది. దర్శకుడు శైలేష్ కొలను కూడా రెడీగా వున్నారు. సైంధవ్ సినిమా ఫలితం వల్ల మళ్లీ కొత్త అవకాశం అంత త్వరగా రాదు కదా. బట్ నాని సంగతి వేరు. అందుకే హిట్ 3 ని బయటకు తీసి, ఓ అయిదు నెలల్లో క్విక్ గా ఫినిష్ చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారని బోగట్టా.
ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్ లో వున్న నాని వచ్చెే నెల తిరిగి వచ్చిన తరువాత దసరా డైరక్టర్ స్క్రిప్ట్ ప్రోగ్రెస్ చూసి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఈ లోగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు నాని కోసం కథలు రెడీ చేయిస్తున్నారు.