చందు మొండేటి.. నాగ్ చైతన్య- సాయి పల్లవి కాంబినేషన్. గీతా సంస్థ నిర్మాణం. తండేల్ సినిమా. డిసెంబర్ లో క్రిస్మస్ కు విడుదల అని ఎప్పుడో డేట్ వేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దాని మీదకు సినిమాలు పడేలా వున్నాయి. లేదా ఆ సినిమా వాయిదా పడేలా వుంది.
అనుకోకుండా పుష్ప 2 సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోకి వచ్చింది. మైత్రీ సంస్థ దే మరో సినిమా రాబిన్ హుడ్. క్రిస్మస్ కు డేట్ వేసారు. ఇప్పుడు దాన్ని మార్చబోతున్నారు. బన్నీ కుటుంబ సంస్ధ గీతా మాత్రం తండేల్ సినిమా ముందుకో, వెనక్కో జరపకుండా వుంటుందా?
రాబిన్ హుడ్, తండేల్ వెళ్లిపోతే ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పండగ వరకు మరే సినిమా వుంటుంది థియేటర్లో? సితార చేతిలో సినిమాలు వున్నాయి. కానీ బన్నీతో అనుబంధం కోసం అయినా ఏ సినిమా వేయరు.
మిగిలింది ఒక్కటే. గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను క్రిస్మస్ కు వేయాలని చూస్తున్నారు. అది వస్తే తండేల్ కు కూడా ఇబ్బందే. అలా కూడా తండేల్ పక్కకు వెళ్లాల్సి వుంటుంది. మొత్తం మీద పుష్ప 2 ఎగిరి వచ్చి డిసెంబర్ లో పడడం అన్నది తండేల్ కు సమస్యగా మారేటట్లే వుంది.