కల్కి..ఫస్ట్ బెస్ట్ వర్క్ ఇదే

కల్కి సినిమా…ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో. ఈ సినిమా కు మంచి క్రేజ్ వుంది. కానీ మంచి బజ్ వుందా అంటే అనుమానం వుంది. కానీ ఈ రేంజ్ సినిమాలకు బజ్ అంటూ ప్రత్యేకంగా అక్కరలేదు.…

కల్కి సినిమా…ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో. ఈ సినిమా కు మంచి క్రేజ్ వుంది. కానీ మంచి బజ్ వుందా అంటే అనుమానం వుంది. కానీ ఈ రేంజ్ సినిమాలకు బజ్ అంటూ ప్రత్యేకంగా అక్కరలేదు. విడుదల నాటికి అదే ఆటోమెటిక్ గా వచ్చేస్తుంది.

అయితే సినిమా విడుదల అంటూ వున్నాక, టీజర్..ట్రయిలర్, పాటలు, ఇలా ప్రమోషన్ కంటెంట్ బయటకు వస్తుంది. కల్కి సినిమాకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కంటెంట్ కు కాస్త డివైడ్ టాక్ వచ్చింది తప్ప యునానిమస్ టాక్ రాలేదు.

ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రీన్ మీదకు వచ్చారు. అసలు కల్కి సినిమా ఏమిటి? దాని ముందు, వెనుక కథ, కమామిషు ఏమిటి అన్నది క్లారిటీ ఇస్తూ, ఓ విడియో చేసారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. బోలెడు మందికి ఇంటర్వూలు ఇవ్వడం, వాళ్లకు చెప్పిందే చెప్పడానికి బదులు, ఇది బెటర్ అనుకుని వుంటారు. రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఏదీ దాచరు. ఇదీ నేను చెప్పబోతున్నా, నేను తీయబోతున్నా అని ముందే చెప్పేసారు. ఎలా తీసారు..ఏం తీసారు అన్నది ఆసక్తి ఎలాగూ వుంటుంది. రాజమౌళి రేంజ్ ఎలాగూ వుంటుంది.

ఇప్పడు నాగ అశ్విన్ కూడా అదే చేసారు. ఎప్పుడూ ఇలాంటి ఫాంటసీ సినిమాలు హాలీవుడ్ కేనా? మనకు వద్దా? మన నేపథ్యంలో మనం తీసుకోవద్దా? అలనాటి పాతాళ భైరవి, ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాల్లాంటివి ఈ జనరేషన్ కు ఇవ్వాలి కదా? అసలు మన పురాణ కథనలను ఎల స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లొచ్చు. ఇలా అన్నీ వివరంగా చెప్పుకుంటూ వచ్చారు.

ఈ ఎపిసోడ్ లు ఇంకా మరో రెండో, మూడో వుంటాయేమో? ఇవన్నీ అయ్యేసరికి ప్రేక్షకులకు ఓ అంచనా వస్తుంది. తామేం చూడబోతున్నామో ఓ ఐడియా వుంటుంది. ఎలాగూ పాన్ ఇండియా సినిమా కనుక నాగ్ అశ్విన్ తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా ఓపిగ్గా ఈ ఎపిసోడ్ లు చేయడం మంచిది అయింది.

కల్కి సినిమా ప్రచారానికి సంబంధించి మంచి ఐడియా ఇది. అందులో సందేహం లేదు.