ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ షోరీల్ కట్ చేశాడు హరీశ్ శంకర్. దానికి ఉస్తాద్ బ్లేజ్ అని టైటిల్ పెట్టాడు. ఇప్పుడు అదే పని మిస్టర్ బచ్చన్ విషయంలో కూడా చేశాడు. దీనికి మిస్టర్ బచ్చన్ షోరీల్ అని పేరు పెట్టాడు.
మేకర్స్ ఏ ఉద్దేశంతో షోరీల్స్ కట్ చేస్తున్నారనే విషయాన్ని పక్కనపెడితే, ఫ్యాన్స్ కు మాత్రం ఇవి మంచి కిక్ ఇస్తున్నాయి. ఈరోజు రిలీజైన మిస్టర్ బచ్చన్ షోరీల్ కూడా అలానే ఉంది.
రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ లో యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈ షోరీల్ కట్ చేసినట్టుంది. వీడియోలో ఎక్కడా రవితేజ డైలాగ్ లేదు. ఆ మాటకొస్తే, వీడియో మొత్తాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కట్ చేశారు. హీరోహీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సెటప్, భారీతనం.. ఇలా అన్నింటినీ సింగిల్ వీడియోలో చూపించే ఉద్దేశం కనిపిస్తోంది.
ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ వస్తోందనేది ఓపెన్ సీక్రెట్. మేకర్స్ మాత్రం ఇంతవరకు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ప్రజెంట్ చేస్తున్నాయి.