మొన్నటికిమొన్న ఐస్ క్రీమ్ తింటుంటే అందులో తెగిన వేలు కనిపించింది. ఇప్పుడు తినే అన్నంలో ఏకంగా పాము ప్రత్యక్షమైంది. దీంతో 11 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. బిహార్ లో జరిగింది ఈ ఘటన.
బిహార్ లోని బంకా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో భోజనం సరిగ్గా ఉండడం లేదని స్టూడెంట్స్ చాలా రోజులుగా కంప్లయింట్ చేస్తున్నారు. కానీ ఎవ్వరూ సరైన చర్యలు తీసుకోలేదు. ఎప్పట్లానే ఆరోజు కూడా స్టూడెంట్స్ భోజనానికి కూర్చున్నారు.
ఆహారంలో నాణ్యత మాట అటుంచి, ఈసారి భోజనంలో ఏకంగా పాము ప్రత్యక్షమైంది. చాలామంది విద్యార్థులకు పాము ముక్కలు కనిపించాయి. దీంతో చాలామంది స్టూడెంట్స్ అక్కడికక్కడే వాంతులు చేసుకున్నారు. అలా 11 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు.
ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఈ మెస్ ను నడిపిస్తున్నాయి. భోజనంలో నాణ్యత ఉండడం లేదని కొన్ని నెలలుగా చెబుతున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
నిజానికి ఈ కాలేజీలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా బల్లులు పడిన ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు విద్యార్థులు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. ఈసారి ఏకంగా పాము ప్రత్యక్షమైంది.