టాలీవుడ్ లో ఇప్పుడు అంతో ఇంతో అన్ని రకాల బిజినెస్ పక్కాగా వున్న హీరో ఎవరు అంటే నాని నే. పాతిక కోట్ల రేంజ్ హీరోలు ఎందరు వున్నా, నాన్ థియేటర్ సేల్ లేదు. థియేటర్ మార్కెట్ లేదు. కానీ నాని సినిమాలకు నాన్ థియేటర్ మంచి రేటుకు అవుతోంది. థియేటర్ కూడా ఫరవాలేదు. బడ్జెట్ కంట్రోల్ లో పెట్టుకోగలిగితే నిర్మాత ఎంతో కొంత లాభం కళ్ల చూడొచ్చు.
మిగిలిన పాతిక కోట్ల హీరోలకు మొదటి మూడు రోజులకు కలిపి కాదు, టోటల్ రన్ లో పాతిక కోట్ల షేర్ రావడం లేదు. పది కోట్ల హీరోలకు టోటల్ రన్ లో పది కోట్ల వసూల్లు రావడం లేదు. పైగా నాన్ థియేటర్ అమ్మకాలు లేవు. అందుకే నిర్మాతలు చాలా మంది నాని తో సినిమా తీయాలని కిందా మీదా అవుతున్నారు.
టాలీవుడ్ కింగ్ పిన్ ఒకరు ఎలాగైనా నానితో సినిమా తీయాలని కిందా మీదా అవుతున్నారు. గతంలో తీసిన తరువాత మళ్లీ చాన్స్ రాలేదు. అందుకే రెండు మూడు రోజులకు ఓసారి టచ్ లోకి వెళ్లి మరీ సినిమా కోసం ట్రయ్ చేస్తున్నారట. కానీ అది ఇప్పట్లో కుదిరేలా లేదని తెలుస్తోంది.
గతంలో నానితో సినిమా తీసిన ఓ యువ నిర్మాత కూడా మళ్లీ సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ నాని ఎందుకో విముఖతతో వున్నారు. అందరితోనూ మంచి సంబంధాలు వుంచుకుంటూనే, తను ఎవరికి సినిమాలు చేయాలో వారికే సెలెక్ట్ డ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు నాని.
మిగిలిన వారికి ఎదురుచూపులే మిగుల్తున్నాయి.