దొంగ కోసం రిచ్ లేడీ రెడీ

రాబిన్ హుడ్ లో నితిన్ హైటెక్ దొంగగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ దొంగ దోచుకోవడానికి ఓ రిచ్ లేడీని సిద్ధం చేశారు. ఆ రిచ్ లేడీ పేరు నీరా వాసుదేవ్. ఈ పాత్రను…

రాబిన్ హుడ్ లో నితిన్ హైటెక్ దొంగగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ దొంగ దోచుకోవడానికి ఓ రిచ్ లేడీని సిద్ధం చేశారు. ఆ రిచ్ లేడీ పేరు నీరా వాసుదేవ్. ఈ పాత్రను శ్రీలల పోషించింది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, వీడియో కూడా విడుదల చేశారు.

రాబిన్ హుడ్ లో తలబిరుసు ఎక్కువగా ఉన్న నీరా పాత్రలో శ్రీలీల కనిపించింది. ప్రైవేట్ జెట్ విమానంలో దిగిన ఆమెను అత్యంత ధనవంతురాలిగా చూపించారు. ఇలాంటి ధనవంతురాలికి, ఓ దొంగకు ఎక్కడ లింక్ కుదిరిందనేది ఆసక్తికరకం.

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది రాబిన్ హుడ్ సినిమా. నిజానికి ఇందులో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఆఖరి నిమిషంలో ఆమె తప్పుకుంది. శ్రీలీల వచ్చి చేరింది.

నితిన్-శ్రీలీల కాంబోలో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో వీళ్లు కలిసి నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది రాబిన్ హుడ్.