సహజీవనం చేసే వాళ్ల కోసం అద్దె ఇల్లు

బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం ఎంత కష్టమో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏడాది అద్దెను అడ్వాన్స్ గా ఇవ్వడం మాట అటుంచి, ఇల్లు ఇవ్వాలంటే ఏకంగా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. కొంతమంది…

బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం ఎంత కష్టమో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏడాది అద్దెను అడ్వాన్స్ గా ఇవ్వడం మాట అటుంచి, ఇల్లు ఇవ్వాలంటే ఏకంగా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. కొంతమంది ఓనర్లు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, ఫామ్-16లు కూడా అడుగుతున్న పరిస్థితి.

బ్యాచిలర్స్ కు ఇల్లు దొరకడం అతి కష్టంగా మారిన ఇలాంటి పరిస్థితుల్లో సహజీవనం చేస్తున్న జంటలకు ఇల్లు దొరకడం దాదాపు దుర్లభం. అందుకే ఓ స్టార్టప్ వ్యాపారవేత్త వినూత్నంగా ఆలోచించాడు. బెంగళూరులో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేసిన ఈ బిజినెస్ మే, తన ఇంటిని సహజీవనం చేసే జంటలకు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రియమ్ సరస్వత్, బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే-అవుట్ కు సమీపంలో ఇల్లు కొనుగోలు చేశాడు. దాన్ని బ్యాచిలర్స్ లేదా సహజీవనం చేస్తున్న జంటలకు అద్దెకు ఇస్తానని ప్రకటించాడు.

సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడంతో భాగంగా.. అద్దె ఇల్లులు దొరక్క ఇబ్బందులు పడుతున్న బ్యాచిలర్స్, లివ్-ఇన్ కపుల్ కోసం తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.

కరోనా తర్వాత బెంగళూరులో అద్దెలు మరింత పెరిగిపోయాయి. బ్యాచిలర్స్ కు ఇల్లు దొరకడం దుర్లభంగా మారిన నేపథ్యంలో.. ప్రియమ్ తీసుకున్న నిర్ణయం బాగుందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.