శాఖల వారీగా శ్వేత పత్రాలు

ప్రభుత్వాలు మారినపుడల్లా శ్వేత పత్రాలు సమర్పించడం ఆనవాయితీగా మారిపోతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా మరోసారి శ్వేత పత్రాల విడుదలకు సిద్దమవుతోంది. Advertisement సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రులకు ఆదేశాలు ఇచ్చేసారు. మంత్రి…

ప్రభుత్వాలు మారినపుడల్లా శ్వేత పత్రాలు సమర్పించడం ఆనవాయితీగా మారిపోతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా మరోసారి శ్వేత పత్రాల విడుదలకు సిద్దమవుతోంది.

సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రులకు ఆదేశాలు ఇచ్చేసారు. మంత్రి వర్గ సభ్యుల ఇష్టా గోష్టి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, మంత్రులకు శాఖలు కేటాయించిన తరువాత వారి వారి శాఖల శ్వేత పత్రాలు సిద్దం చేయాలని చెప్పారు.

అంటే జగన్ ప్రభుత్వం వైఫల్యాలను శ్వేతపత్రాల ద్వారా తెలియచేయాలని అనుకోవడం కంటే, భవిష్యత్ లో కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అనే మాట రాకుండా ఇది ముందు జాగ్రత్త అనుకోవాలి. పనిలో పనిగా గత ప్రభుత్వ మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందిని ఎవరినీ మంత్రులు తీసుకోవద్దని చంద్రబాబు క్లారిటీగా చెప్పేసారు.

సాధారణంగా ఓఎస్డీలు, పిఎలుగా పని చేసిన వారు ప్రభుత్వం మారినా, ఏదో విధంగా రికమెండ్ చేయించుకుని కొత్త మంత్రుల దగ్గర చేరతారు. అలాంటి వారి ఆశలకు చంద్రబాబు గండి కొట్టేసారు. పూర్తిగా కొత్తవారిని తీసుకోవాల్సి వుంటుంది.

బహుశా చంద్రబాబు నే మంత్రుల దగ్గర ఓఎస్డీలను, పిఎ లను నియమించినా ఆశ్చర్యం లేదు. గతంలో ఇలా చేసిన సందర్భాలు వున్నాయి. అలా చేయడం ద్వారా మంత్రుల డే టు డే యాక్టివిటీ అంతా సిఎమ్ కు తెలుస్తూ వుంటుంది.

ఈ రాత్రికి లేదా రేపు శాఖల కేటాయింపు వుంటుందని తెలుస్తోంది.