పుష్ప-2కు పోటీగా మరో సినిమా

ఇప్పటికే బాలీవుడ్ లో పుష్ప-2 సినిమాకు సోలో రిలీజ్ మిస్సయింది. జాన్ అబ్రహాం నటించిన సినిమాను ఆరోజు బన్నీకి పోటీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా పుష్ప-2కు సోలో రిలీజ్ మిస్సయ్యేలా…

ఇప్పటికే బాలీవుడ్ లో పుష్ప-2 సినిమాకు సోలో రిలీజ్ మిస్సయింది. జాన్ అబ్రహాం నటించిన సినిమాను ఆరోజు బన్నీకి పోటీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా పుష్ప-2కు సోలో రిలీజ్ మిస్సయ్యేలా ఉంది.

విక్రమ్ హీరోగా నటించిన తంగళాన్ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు ఆ తేదీకి ఫిక్స్ అంటూ కథనాలు మొదలయ్యాయి. పోస్టర్ వదలడమే ఆలస్యం.

ఇదే కనుక జరిగితే కోలీవుడ్ లో పుష్ప-2కు గట్టి పోటీ ఎదురైనట్టే. ఎందుకంటే, తమిళనాట విక్రమ్ కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ పోటీతో పోలిస్తే, కోలీవుడ్ లోనే ఇప్పుడు పుష్ప-2కు గట్టి పోటీ నెలకొంది.

మరోవైపు పుష్ప-2 వాయిదా పడిందనే పుకార్ల నేపథ్యంలో, అజయ్ దేవగన్ నటించిన సింగం ఎగైన్ సినిమా మరోసారి తెరపైకొచ్చింది. నిజానికి పుష్ప-2 కంటే ముందు ఆగస్ట్ 15 తేదీని వీళ్లు ప్రకటించారు. ఎప్పుడైతే పుష్ప-2 విడుదల తేదీ వచ్చిందో, అప్పుడు అజయ్ దేవగన్ సినిమా వెనక్కు తగ్గింది.

ఇప్పుడు పుష్ప-2 పోస్ట్ పోన్ అవుతుందనే పుకార్ల నేపథ్యంలో.. సింగం ఎగైన్ ను ఆ తేదీకి తీసుకురావాలంటూ అజయ్ దేవగన్ ఫ్యాన్స్ వరుసపెట్టి పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే ఈ సస్పెన్స్ కు తెరపడనుంది.