మెగాస్టార్.. చెవిలో చెప్పలేదు

చెడు వుంటే చెవిలో చెప్పండి.. అంటూ టాలీవుడ్ జనాలకు సుద్దులు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే దానిని పాటించలేదు. Advertisement అల్లు అర్జున్ ఓపెన్ గా తన మిత్రుడికి…

చెడు వుంటే చెవిలో చెప్పండి.. అంటూ టాలీవుడ్ జనాలకు సుద్దులు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే దానిని పాటించలేదు.

అల్లు అర్జున్ ఓపెన్ గా తన మిత్రుడికి ఎన్నికల్లో మద్దతు పలికారు. జస్ట్ స్నేహం కారణంగానే. కానీ ఆ మిత్రుడు వైకాపాలో వున్నారు. దాంతో మెగా కుటుంబంలో చీలిక అన్నట్ల ప్రెజెంట్ అయింది. కానీ ఈ విషయంలో బన్నీ మౌనంగానే వున్నారు. ఎన్నికల తరువాత అభినందన ట్వీట్ కూడా వేసారు.  అంతా బాగానే వుంది అనుకుంటూ వుంటే, మళ్లీ దాన్ని కెలికారు హీరో సాయి ధరమ్ తేజ్.

తన ఇన్ స్టా అకౌంట్ లో బన్నీ ని అన్ ఫాలో కొట్టారు. బన్నీనే కాదు, బన్నీ భార్య స్నేహా రెడ్డిని కూడా అన్ ఫాలో కొట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మెగా ఫ్యామిలీలో విబేధాలు గుప్పుమన్నాయి. బన్నీ చేసింది నప్పకుండా వుంటే, మెగాస్టార్ చెప్పినట్లు అతడి చెవిలో చెప్పాల్సింది సాయి ధరమ్ తేజ్. అలా చేయకుండా ఇలా అన్ ఫాలో కొట్టడం అంటే మైక్ లో చెప్పినట్లు అయింది.

ఇప్పుడు అన్ని మాధ్యమాలు కలిసి ఈ వార్తను హైలైట్ చేయడం ప్రారంభించాయి. పుష్ప 2 విడుదలకు ముందు ఇలా జరగడం అంటే, రేపు విడుదల టైమ్ లో ఎలా వుంటుందో? మెగా ఫ్యాన్స్ రెండుగా చీలిపోయి, ప్రో పుష్ప.. యాంటీ పుష్ప అంటూ ట్వీట్ ల యుద్దాలు సాగిస్తారేమో?