ఆంధ్ర రాజధాని అమరావతి అన్నది, దానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తున్నామన్న సంగతి జనాలకు తెలిపే ప్రయత్నం జరుగుతున్నట్లుంది. అమరావతిలో సినిమా ఫంక్షన్లు జరపడం ద్వారా మరింత పేరు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా కల్కి సినిమా ఫంక్షన్ ను అమరావతిలో చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. అత్యంత భారీగా ఈ పంక్షన్ ను నిర్వహించాలని నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తం సెలబ్రిటీలను స్పెషల్ ఫ్లయిట్ ల ద్వారా అక్కడికి తీసుకెళ్తారు. ప్రభాస్, అమితాబ్, దీపిక ఇలా అందరినీ స్పెషల్ ఫ్లయిట్స్ తో అమరావతి రప్పిస్తారు. చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా వుండనే వుంటారు. లక్ష మంది జనాలను సమీకరించాలని, వస్తారని అంచనా. కల్కి సినిమాకు సంబంధించినంత వరకు అత్యంత భారీ ఫంక్షన్ ఇదే అవుతుంది. ముంబాయిలో, చెన్నయ్ ల్లో కూడా ఈవెంట్లు వుంటాయి.
ఇదిలా వుంటే బాలయ్య- బోయపాటి సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కూడా అమరావతిలో చేసే ఆలోచన వుంది. తాతమ్మ కల సినిమాతో బాలయ్య సినిమాల్లోకి వచ్చి యాభై ఏళ్లు అయిన సందర్భంగా ఈ ఓపెనింగ్ ప్లాన్ చేస్తే బాగుంటుందని, అదీ అమరావతిలో అయితే ఇంకా బాగుంటుందని ఆలోచనలు సాగుతున్నాయి.