క్షత్రియులు దూరమైంది ఈయన వల్ల కాదా?

ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే ఇలాగే వుంటుంది. స్వరూపానంద అనే స్వామీజీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు జగన్. జగన్ అండ చూసుకుని దేవాదాయ శాఖ మీద పెత్తనం చేసారు సదరు స్వామీజీ, స్వామీజీ ఆశ్రమంలో కార్యక్రమాలు…

ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే ఇలాగే వుంటుంది. స్వరూపానంద అనే స్వామీజీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు జగన్. జగన్ అండ చూసుకుని దేవాదాయ శాఖ మీద పెత్తనం చేసారు సదరు స్వామీజీ, స్వామీజీ ఆశ్రమంలో కార్యక్రమాలు జరిగితే వివిధ ఆలయాల నుంచి వేద పండితులను డిప్యూటేషన్ పంపారు. అసలు ఈ ఆశ్రమానికి, దేవాలయాలకు ఏమిటి సంబంధం అని అడిగిన వారు లేరు. దేవాదాయ శాఖ లో అనేక వ్యవహారాలు ఈ స్వామీజీ చుట్టూ తిరిగాయి. ప్రభుత్వ భూములు ఈ ఆశ్రమానికి ఇచ్చారు.

ఇప్పుడు సదరు స్వామీజీ జగన్ ను విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ వర్గం జగన్ కు దూరం కావడానికి, పరోక్షంగా కత్తి కట్టడానికి కారణం ఎవరు? ఇదే స్వరూపానంద అన్నదే రాజకీయ వర్గాల టాక్.

సింహాచలం దేవస్థానం పూసపాటి వారి వంశపారంపర్వ దేవస్థానం. దానికి అశోక్ గజపతి వంశపారంపర్య ధర్మకర్త. సింహాచలం దేవస్థానం విషయంలో ఈ స్వామిజీ మాట విని తొందరపడి, అశోక్ ను తొలగించి ఉమాగజపతి కూతురును తీసుకువచ్చారు. నానా రభస కు కారణం అయ్యారు. ఒక దశలో విజయనగరం కోట మీదే అశోక్ కుటుంబానికి అవమానం జరిగింది.

ఉత్తరాంధ్ర రాజులు ఇవన్నీ దృష్టిలో వుంచుకున్నారు. దీనికి తోడు రఘురామకృష్ణ రాజు ఉదంతం వుండనే వుంది. మొత్తం మీద మొన్నటి ఎన్నికల్లో రాజులు అంతా ఒక్కటే తెలుగుదేశానికి అనుకూలంగా పని చేసారు.  ఇప్పుడు అదే స్వామీజీ జగన్ మీద సన్నాయి నొక్కలు నొక్కుతున్నారు. నమ్మడానికి అక్కడ వున్నది జగన్ కాదు. చంద్రబాబు. ఇలాంటి వాళ్లను ఆయన చాలా మందిని చూసేసాడు. స్వరూపానంద పప్పులు అక్కడ వుండకవు.