బందిపోటుగా బాలయ్య

బాలయ్య సినిమాలు ఎక్కువగా రెండు పాత్రలు లేదా రెండు షేడ్ లు వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, దాంట్లో బలమైన పాత్ర మస్ట్ గా వుంటుంది. మాస్ డైరక్టర్ బాబీ లేటెస్ట్ గా చేస్తున్న…

బాలయ్య సినిమాలు ఎక్కువగా రెండు పాత్రలు లేదా రెండు షేడ్ లు వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, దాంట్లో బలమైన పాత్ర మస్ట్ గా వుంటుంది. మాస్ డైరక్టర్ బాబీ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా బాలయ్యతోనే. సితార సంస్థ నిర్మాణం. ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ వదిలారు.

దేవుడు మంచివాడు.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. అలాంటి వాళ్లను మట్టు పెట్టాలంటే.. ఎలాంటివాడు రావాలి..అలాంటి వాడే హీరో అనే యాంగిల్ లో గ్లింప్స్ ను కట్ చేసారు. బాలయ్య తన సరకు, సరంజామాతో ట్రయిన్ దిగి సీన్ లోకి ఎంటర్ అవుతాడన్న మాట.

ఈ సినిమాలో బాలయ్య కథ ముందు నుంచి వెనుకకు వెళ్తుందని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ …ఆ నేపథ్యంలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ వుండడం అనేది అనేకానేక సినిమాల్లో చూసాము. ఈ సినిమాలో కూడా బలమైన ఫ్లాష్ బ్యాక్ వుంటుందని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య బందిపోటుగా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమా డిఫెరెంట్ సబ్జెక్ట్ అని, ఫార్మాట్ రెగ్యులర్ గా వున్నా, రొటీన్ బాలయ్య మాస్ సినిమాల మాదిరిగా వుండదని తెలుస్తోంది.