కల్కి.. ఫస్టాఫ్ క్లాస్.. సెకండాఫ్ మాస్!

ప్రభాస్-నాగ్ అశ్విన్ కల్కి ఎలా వుండబోతోంది అని కాస్త రుచి చూపించే ట్రయిలర్ రేపు వస్తోంది. రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా థియేటర్రలోనే ట్రయిలర్ ను ప్రేక్షకులు వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ట్రయిలర్ కోసమే…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కల్కి ఎలా వుండబోతోంది అని కాస్త రుచి చూపించే ట్రయిలర్ రేపు వస్తోంది. రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా థియేటర్రలోనే ట్రయిలర్ ను ప్రేక్షకులు వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ట్రయిలర్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా వుంటే కల్కి సినిమా తొలి సగం క్లాస్ టచ్ తో వుంటుందని తెలుస్తోంది. మలిసగం మాస్ టచ్ తో వుంటుందట. తొలిసగం అంతా కల్కి లోకంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తుంది. మలిసగం అంతా ఉర్రూత లూగిస్తుంది అని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ మలిసగం ఎలా వుండబోతోందో, అదే టోన్ లో కల్కి 2 కూడా సాగుతుందని బోగట్టా. అందవల్ల కల్కి వన్ కన్నా టూ మీద ఫ్యాన్స్ మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకోవచ్చు అన్నమాట. పైగా కమల్ పాత్ర కల్కి వన్ లో పరిచయం మాత్రమే. అసలు అంతా కల్కి 2 లోనే వుంటుంది. కల్కి సినిమా స్పెషల్ షో లకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్ జంట నగరాల్లోని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే తెల్లవారుఝామన 1 గంటకు స్పెషల్ షో లు వుండే అవకాశం వుంది. మల్టీ ఫ్లెక్స్ లో వుండకపోవచ్చు. మాస్ థియేటర్ జనాలకు సినిమాను తెల్లవారుఝామునే అందుబాటులోకి తెస్తారు. మల్టీ ఫ్లెక్స్ లో తెల్లవారుఝామున ఒంటి గంటకు షో వేస్తే సమస్యలు వుంటాయని ఆలోచిస్తున్నారు.