హీరోయిన్ సమంత ఇంకా కోలుకోలేదా? ఆమె ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్టులతో బాధ పడుతోందా? తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్ ఈ ప్రశ్నల్ని మరోసారి లేవనెత్తింది. అవును.. ఆమె ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
మయొసైటిస్ బారిన పడిన తర్వాత అనేక సైడ్ ఎఫెక్టులకు గురైంది సమంత. వాటి నుంచి కోలుకునేందుకు ఏకంగా సినిమాలకు విరామం ప్రకటించింది. అలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఆమె శారీరకంగా పూర్తి ఫిట్ గా తయారైందని అంతా అనుకున్నారు. సమంత కూడా కొత్త ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి మరీ కొత్త సినిమా ప్రకటించింది.
దీంతో అంతా సెట్ అనుకున్నారు. కానీ సమంత ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉంది. సైడ్ ఎఫెక్టుల నుంచి బయటపడేందుకు ఆమె ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. ఎక్కువగా మందుల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు, అందం కూడా దెబ్బతింటుంది కాబట్టి సమంత ఈ విధానాల్ని ఎక్కువగా పాటిస్తోంది.
ఇందులో భాగంగా ఆమె ఇప్పటికే ఐస్ టబ్ బాత్, క్రియో థెరపీ, న్యూరో నెర్డ్, ఇన్-ఫ్రారెడ్ సానా, ఎల్ఈడీ లైట్ థెరపీ లాంటి చికిత్సలు తీసుకుంది. దీంతో పాటు రోజూ ధ్యానం చేస్తోంది. చూస్తుంటే, మరికొన్ని వారాల పాటు సమంత ఈ చికిత్స విధానాల్ని కొనసాగించేలా ఉంది.