బుజ్జి చుట్టూ తిరుగుతున్న కల్కి

కల్కి సినిమా ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించాలని యూనిట్ భావించింది. దీని కోసం బుజ్జిని మెయిన్ థీమ్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కల్కి సినిమా ప్రచారం మొత్తం బుజ్జి చుట్టూ తిరుగుతోంది. Advertisement ఈ…

కల్కి సినిమా ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించాలని యూనిట్ భావించింది. దీని కోసం బుజ్జిని మెయిన్ థీమ్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కల్కి సినిమా ప్రచారం మొత్తం బుజ్జి చుట్టూ తిరుగుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ వాడే కారు పేరు బుజ్జి. దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. ఈ కారు ఆవిష్కరణతోనే కల్కి ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కు చేరాయి. బుజ్జిని డ్రైవ్ చేస్తూ, ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక్కడితో బుజ్జి కాన్సెప్ట్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాగచైతన్య లాంటి కొంతమంది సెలబ్రిటీల్ని తీసుకొచ్చి బుజ్జిని ప్రమోట్ చేశారు. ఆ తర్వాత చెన్నై తీసుకెళ్లారు. ఇప్పుడు బుజ్జి బొమ్మల్ని కూడా తయారుచేసి పంపిణీ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లీంకారకు కల్కి కార్టూన్లతో పాటు, బుజ్జి బొమ్మను అందించారు.

కల్కి కోసం బాహుబలి సెంటిమెంట్

మరోవైపు కల్కి ట్రయిలర్ లాంచ్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ విషయంలో బాహుబలి ఫార్ములాను ఫాలో అవ్వాలని భావిస్తున్నారు మేకర్స్. ఇన్నాళ్లూ లోకల్ గా చేసిన ప్రచారాన్ని, ట్రయిలర్ తో జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

అందుకే ముంబయిలో ట్రయిలర్ లాంచ్ పెట్టుకున్నారు. బాహుబలి-2 ట్రయిలర్ ను ముంబయిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వీకెండ్ ముంబయిలో కల్కి ట్రయిలర్ ను లాంచ్ చేస్తారు. ప్రభాస్ తో పాటు.. అమితాబ్, దీపిక, దిశా పటానీ ఈ ట్రయిలర్ లాంచ్ కు హాజరుకాబోతున్నారు.

ఈనెల 27న థియేటర్లలోకి రాబోతోంది కల్కి సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మరిన్ని ప్రచార ఎత్తుగడల్ని అనుసరించబోతోంది యూనిట్. ఓవర్సీస్ లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.