నిన్న రిలీజైన ఎగ్జిట్ పోల్స్ పవన్ కల్యాణ్ కు కచ్చితంగా ఉత్సాహం తెప్పించి ఉంటాయి. దాదాపు సగానికి పైగా సర్వేలు కూటమి గెలుపు ఖాయమని ప్రకటించాయి. దీంతో జనసేనతో పాటు పవన్ లో ఉత్సాహం పెరిగింది. అదే టైమ్ లో అతడితో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ లో నీరసం ఆవహించింది.
పవన్ గెలవాలని జనసేన పార్టీతో పాటు, అతడి అభిమానులు, నిర్మాతలు కూడా కచ్చితంగా కోరుకుంటారు. కాకపోతే గెలిస్తే తమ సినిమాల షూటింగ్స్ మరింత ఆలస్యమౌతాయనేది వాళ్ల బాధ. అంతకుమించి మరేం లేదు.
కూటమితో పాటు పవన్ గెలిస్తే, అతడికి ప్రాధాన్యం పెరుగుతుంది. 2014లా కూటమిని గెలిపించి పక్కకు తప్పుకోవాలని పవన్ అనుకోవడం లేదు. ఈసారి గెలిస్తే రాజకీయంగా ప్రాధాన్యమైన స్థానంలో ఉండాలని పవన్ అనుకుంటున్నారు. అతడు కేబినెట్ లో కూడా ఉంటాడనే ప్రచారం సాగుతోంది.
అదే కనుక జరిగితే పవన్ కు బాధ్యతలు పెరుగుతాయి, అతడి సినిమాల షూటింగ్స్ మరింత ఆలస్యం అవుతాయి.
ఒకవేళ పవన్ ఓడిపోతే.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే, అది అతడికి అలవాటే. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉండనే ఉంది. కాబట్టి కొన్ని రోజులు ఒంటరిగా గడిపి ఆ వెంటనే సినిమాల్లోకి వచ్చేస్తారు. గెలిచి, ప్రభుత్వంలో భాగమైతే మాత్రం నిర్మాతలకు మరింత వెయిటింగ్ తప్పదు.