రీఎంట్రీ కోసం హీరోయిన్ కష్టాలు

హీరోయిన్ గా నిలదొక్కుకోవడం ఎంత కష్టమో.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగడం కూడా అంతే కష్టం. చాన్నాళ్ల కిందటే రీఎంట్రీ ఇచ్చిన మధుబాల ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఇప్పుడీ…

హీరోయిన్ గా నిలదొక్కుకోవడం ఎంత కష్టమో.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగడం కూడా అంతే కష్టం. చాన్నాళ్ల కిందటే రీఎంట్రీ ఇచ్చిన మధుబాల ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. ఆమె పేరు మీరా జాస్మిన్.

ఈ హీరోయిన్ కు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ ఈమె. పవన్ కల్యాణ్, రవితేజ, రాజశేఖర్, గోపీచంద్ లాంటి హీరోల సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమెకు మంచి హిట్స్ ఉన్నాయి.

42 ఏళ్ల మీరా జాస్మిన్ తెలుగులో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆమధ్య వచ్చిన విమానం అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది. అది ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇప్పుడు శ్వాగ్ అనే సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలొస్తాయి.

నిజానికి కెరీర్ లో గ్యాప్ ఇవ్వలేదు మీరా జాస్మిన్. 22 ఏళ్ల నుంచి ఆమె నటిస్తూనే ఉంది. మధ్యలో కరోనా కారణంగా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్ని విడిచిపెట్టలేదు. తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూనే ఉంది.

ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీ అవ్వడానికి ట్రై చేస్తోంది. రీసెంట్ గా ఆమె స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె మరింత స్లిమ్ అయింది. ఈ మేకోవర్ కు తోడు కాస్త అదృష్టం కూడా కలిసొస్తే మీరా జాస్మిన్ దశ తిరిగినట్టే.