అదేంటో.. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిన ముద్దుగుమ్మలంతా టాలీవుడ్ కు వచ్చేసరికి పద్ధతిగా మారిపోతారు. మన మేకర్స్ వాళ్లను అలా చూపిస్తారా లేక అలాంటి కండిషన్స్ తో వీళ్లు ఇండస్ట్రీకి వస్తారా అనేది చాలామందికి డౌట్. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, కొన్నేళ్లుగా టాలీవుడ్ లో నడుస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి జాన్వి కపూర్ కూడా చేరినట్టుంది.
జాన్వి కపూర్ అందాల గురించి వర్ణించడం కంటే, ఆమె ఫొటోషూట్స్ చూస్తే చాలు. ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్వి అంత హాట్ గా మరో హీరోయిన్ కనిపించడం లేదు. ఇది నిజం. అలవోకగా అందాలు ఆరబోయడం జాన్వి స్పెషాలిటీ.
ఇలాంటి హీరోయిన్ సౌత్ కు వచ్చేసరికి పద్ధతిగా మారిపోయింది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది జాన్వి కపూర్. ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా. ఇందులో ఆమె పల్లెటూరి పిల్ల పాత్రలో లంగావోణీతో కనిపిస్తోంది.
త్వరలోనే ఆమె రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సినిమాలో నటించనుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో కూడా జాన్విది పల్లెటూరి పిల్ల పాత్ర అంటున్నారు చాలామంది. బాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ ను వేడెక్కించిన ఈ ముద్దుగుమ్మ, సౌత్ కు వచ్చేసరికి ఇలా సంప్రదాయబద్ధంగా మారిపోయింది.
సౌత్ లో ఆమె ఇలాంటి పాత్రలే ఎంచుకుంటోందా.. మేకర్స్ ఆమెను ఇలానే చూపించాలని ఫిక్స్ అయ్యారా.. లేక దక్షిణాది సినిమాలకు సంబంధించి స్కిన్ షో చేయనని జాన్వి ఏమైనా కొత్త రూల్స్ పెట్టిందా?