సినిమాల్లో రాను రాను డైలాగులు శృతి మీరుతున్నాయి. గీత దాటుతున్నాయి. సెన్సారు పట్టుకుంటే మ్యూట్..లేదంటే సినిమాకు క్రేజ్. ఇదంతా వెబ్ సిరీస్ ల ప్రభావం కావచ్చు. త్వరలో రాబోతోంది లవ్ మౌళి అనే సినిమా. ఈ సినిమా అనేక వాయిదాలు పడింది. సెన్సారు గండాలు దాటింది. ఆఖరికి ఇప్పుడు విడుదల కాబోతోంది ఈవారం. ఈ సినిమా నుంచి కొన్ని డైలాగులు తెలుస్తున్నాయి.
‘’..ఇప్పుడేంటి…నువ్వు కూడా దాని లాగే నన్ను వదిలేసి వెళ్లి వాడితో పడుకోవాలా?’’
‘’నీకు ఇంకా ఓపిక వుందా?
మూడు సార్లే కదా. ఇంకొక్కసారి చేస్తే మన రికార్డ్ బ్రేక్ చేయచ్చు.
కమాన్ బేబీ..లెట్స్ డు ఇట్…
రికార్డ్స్ కాదు..బాడీలో పార్ట్ లు బ్రేక్ అయ్యేలా వున్నాయి’’
‘’ఛీ..నీ వళ్లంతా తడి..జరుగు…
రోజూ నా చెమట తడిలవో పడి దొర్లుతున్నావ్ గా..ఇప్పుడేమైంది..
కొన్ని విషయాలు కొన్ని సార్లు నచ్చవ్
ఇవీ లవ్ మౌళి లో కొన్ని శాంపిల్ డైలాగులు.
అంతే కాదు ఈ సినిమాలో మొత్తం 42 ముద్దు సీన్లు వున్నాయట.
టైటానిక్ సినిమాలో మాదిరిగా ఓ మూడు నిమిషాల హాట్ సీన్ వుందట,
తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోతోంది. ఓటిటి పుణ్యమా అని.