సీఎం అక్కడ జెండా పాతినట్లేనా?

అనకాపల్లికి పారా చూట్ నేతగా సీం రమేష్ దిగి వచ్చారని ఆదిలో విమర్శలు వచ్చాయి. అయితే ఆయన బిగ్ షాట్ కావడం టీడీపీలో దశాబ్దాలుగా ఉండడంతో పాటు పోల్ మేనేజ్మెంట్ లో పకడ్బందీగా వేసుకున్న…

అనకాపల్లికి పారా చూట్ నేతగా సీం రమేష్ దిగి వచ్చారని ఆదిలో విమర్శలు వచ్చాయి. అయితే ఆయన బిగ్ షాట్ కావడం టీడీపీలో దశాబ్దాలుగా ఉండడంతో పాటు పోల్ మేనేజ్మెంట్ లో పకడ్బందీగా వేసుకున్న వ్యూహాలు అన్నీ ఫలించి ఆయన రాజకీయ జీవితంలో మొదటి సారి ఉత్తరాంధ్ర నుంచి ఎంపీగా చేసి పార్లమెంట్ కి పంపించబోతున్నాయా అన్నది ఇపుడు చర్చకు తావిస్తోంది.

పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ముడిపడి ఉన్న అనకాపల్లి నుంచి జనాలకు ఏ మాత్రం తెలియని పువ్వు గుర్తు మీద పోటీ చేయడం అత్యంత సాహసం. అది కూడా కనీసం పొరుగు జిల్లా కాకుండా పది జిల్లా అవతల నుంచి వచ్చి ఎంపీగా కంటెస్ట్ చేయడం కూడా మరో వింత అనుకున్నారు. కానీ సీఎం రమేష్ తన చుట్టూనే కూటమి రాజకీయాన్ని తిప్పుకోవడంతో పాటు రూరల్ లో టీడీపీ బలంగా ఉండడం, జనసేన ప్రభావాన్ని కూడా మిక్స్ చేసుకుంటూ గెలుపు అంచులకు చేరుకున్నారని అంటున్నారు.

పోలింగ్ అనంతరం రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేసినా పోలింగ్ జరిగిన తీరు తరువాత చూస్తే ఆయన గెలుపు ఖాయమని ఒక మాట వినిపించింది. ఇపుడు ఎగ్జిట్ పోల్
సర్వేలు అదే అంచనాను చెబుతున్నాయి.

అయితే అలా ఏమీ లేదని తామే గెలుస్తున్నామని వైసీపీ చెబుతోంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నది కూడా వినిపించిన విషయం. అయితే రమేష్ గెలుపునకు టీడీపీ మనిషిగా ఆయన్ని సొంతం చేసుకోవడంతో పాటు అంగబలం అర్ధబలం అలాగే ఒక ప్రధాన సామాజిక వర్గం అండర్ కరెంట్ గా కూటమికి నూటికి తొంబై శాతం నిలబడడం కారణం అవుతాయని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ అసలు ఫలితాలలో గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చూస్తూ ఉండండి అని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మదగినవిగా లేవు అని అంటున్నారు. అందులో కూడా నిజం ఉంది అనేలా వైసీపీ గెలిచే సీట్లు కూడా చాలా చోట్ల టీడీపీ ఖాతాలో వేయడంతోనే కొత్త డౌట్లు పుట్టుకుని వస్తున్నాయి. అయినా ఇవన్నీ అంచనాలే అని తామే గెలుస్తామ్ని ఎవరి మటుకు వారు ధీమా పడుతున్నారు.