తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా!

లోక్‌సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. రెండున్న‌ర నెల‌ల‌పాటు విరామం లేకుండా మోగిన మైకులు.. మూగ‌బోయాయి. ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డ నేత‌లు అంద‌రి సైలెంట్ అయిపోయారు. రేపు చివ‌రిద‌శ పోలింగ్ నేప‌థ్యంలో కేంద్ర హోం…

లోక్‌సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. రెండున్న‌ర నెల‌ల‌పాటు విరామం లేకుండా మోగిన మైకులు.. మూగ‌బోయాయి. ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డ నేత‌లు అంద‌రి సైలెంట్ అయిపోయారు. రేపు చివ‌రిద‌శ పోలింగ్ నేప‌థ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. 

షాకు వేద‌పండితులు ఆశీర్వ‌చ‌నం ప‌లికి, తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. మధ్యాహ్నం 12 గంట‌ల‌కు గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. గ‌త రెండు నెల‌లుగా దేశం మొత్తం అమిత్ షా విస్తృతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. 400 సీట్లు గెలుస్తామ‌నే ధీమాతో ఎన్టీఏ నేత‌లు ఉంటే.. ఇండియా కూట‌మినే అధికారంలోకి వ‌స్తుంద‌ని కూట‌మి నేత‌లు చెప్తున్నారు. 

కాగా రేపు మొత్తం 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో తుదిదశ పోలింగ్‌ జరుగుతుంది. రేపు సాయంత్రం పోలింగ్ అనంత‌రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. జూన్ 4 న వ‌చ్చే ఎగ్జాట్ ఫ‌లితాల కంటే ఎగ్జిట్ పోల్స్‌పైనే అంద‌రికి అశ‌క్తి నెల‌కొంది. మ‌రో నాలుగు రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో నాయ‌కుల జాతక‌లు బయటపడనున్నాయి.