ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చంద్రబాబు మనిషిగా ముద్రపడిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ రిటైర్ కాబోతున్నారు. ఈ రోజైనా ఆయన ఏదో పోస్టింగ్‌తో రిటైర్ అవుతారా లేదా అనేది అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిన్న ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పులో తీర్పు రావడంతో కోర్టు ఉత్తర్వులను సీఎస్ జవహర్ రెడ్డికి అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని ఆయనకు సీఎస్ చెప్పారు. దీంతో రిటైర్ మెంట్ చివరి రోజు అయినా ఆయనకు పోస్టింగ్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఏబీవికి ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలని ఒక సామాజిక వర్గం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఫెయిడ్ క్యాంపెయిన్ రన్ చేస్తోంది.
కాగా, టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంతో మే 31, 2019న ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అప్పటి నుండి సుప్రీం కోర్టు, క్యాట్ లో పోరాడుతున్న ఆయనకు మధ్యలో తనకు అనుకూలంగా తీర్పు రావడంతో.. సస్పెండ్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికారులకు, నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.
రోజుల వ్యవధిలోనే మరోసారి ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇటీవల క్యాట్ లో తనకు అనుకూలంగా తీర్పు రావడం ఆయన డీజీపీ అవ్వబోతున్నారంటూ టీడీపీ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వచ్చాయి. తీరా క్యాట్ ఉత్తర్వులపై కూడా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో నిన్న ఏబీవీకి ఊరట లభించింది. దీంతో ఆయన రిటైర్మెంట్ చివరి రోజు అయినా ఏదో పోస్ట్ తో రిటైర్ కావాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా పరిణామాలను గమనిస్తే … చంద్రబాబు హయాంలో పరిధికి మంచి, అన్నీ తానే అన్నట్టు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ చేయరాని తప్పులన్నీ చేసి, ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని అందరు అంటున్నారు.