సుధీర్ బాబు నటించిన సినిమా హరోం హర. మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్ ను విడుదల చేసారు. ఈ మధ్య కాలంలో సుధీర్ బాబుకు మంచి సినిమాలు పడడం లేదు. కానీ హరోం..హర ట్రయిలర్ ను చూస్తుంటే ఆ కొరత తీర్చేలా కనిపిస్తోంది.
సుధీర్ బాబు పాపం వైవిధ్యమైన కథల కోసం చూస్తుంటాడు. కష్టపడతాడు. కానీ సినిమాలు తేడా కొడుతున్నాయి. కానీ హరోం హర ట్రయిలర్ చూస్తుంటే, కాస్త విషయం వున్న డైరక్టర్ దొరికినట్లు కనిపిస్తోంది.
డబ్బులు లేకపోతే ఏ విధంగానూ పనికిరారు అనే ఆలోచనతో తుపాకుల తయారీకి దిగుతాడు సుబ్రహ్మణం.. ఇతగాడిది చిత్తూరు జిల్లా కుప్పం. తుపాకులు తయారవుతాయి. డబ్బు పోగవుతుంది. కానీ అదే సమయంలో శతృవులు పెరుగుతారు. ఇలాంటి కథ తీసుకుని దర్శకుడు జ్ఙాన్ సాగర్ సినిమా తీసినట్లు కనిపిస్తోంది.
చిత్తూరు యాసను బాగా పలికించారు. సుధీర్ బాబుకు సపోర్ట్ గా సునీల్ నిలిచాడు. ట్రయిలర్ లో మంచి డైలాగులు పడ్డాయి. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. హీరోయిన్ గా మాళవిక శర్మ కాస్త డీగ్లామర్ రోల్ లో కనిపించింది.
పెద్దగా పోటీ లేకుండా జూన్ రెండో వారంలో విడుదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత సుబ్రహ్మణ్యం.