ఒకరు మేన మామ మరొకరు మేనల్లుడు. మామకు అండగా ఒకనాడు మేనల్లుడు ఉన్నాడు. అతి గతించిన కాలం. గత మూడు ఎన్నికల నుంచి ఇద్దరిదీ వేరు పార్టీలు వేరు దారులు అయ్యాయి. శ్రీకాకుళంలో ఆముదాలవలస సీటులో మామ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అల్లుడు కూన రవికుమార్ ల మధ్య భీకరమైన పోరు సాగింది. వైసీపీ తరఫున మూడవసారి తమ్మినేని పోటీ చేస్తే టీడీపీ నుంచి నాలుగవసారి కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు.
ఇద్దరిలో ఎవరు విజేతలు అన్నది తెలియనంతగా ఫైట్ అయితే సాగింది అని పోలింగ్ అనంతర సరళి చెబుతోంది అంటున్నారు. సర్వేలు కూడా ఎక్కువగా ఆముదాలవలస టఫ్ ఫైట్ అని చెబుతున్నాయి. దీంతో ఏడు పదుల చేరువలో ఉంటూ చివరి ఎన్నికలుగా ప్రచారం చేసుకున్న తమ్మినేని సానుభూతి మంత్రం పనిచేసిందా అన్న పాయింట్ లో చర్చ మొదలైంది. అలా కాకుండా దూకుడుగా రాజకీయం చేసే కూనకే ఓటు అని జనాలు ఆ సైడ్ నిలబడ్డారా అన్నది కూడా డిస్కషన్ గా ఉంది.
ఆముదాలవలసలో విభజన తరువాత ఒకసారి మామ ఒకసారి అల్లుడు గెలిచారు. ఇపుడు ఎవరిది విజయం అయితే వారికే ఈ సీటు కట్టుబడి పోతుంది అని అంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడిని తీసుకుని రావాలని తమ్మినేని చూస్తున్నారు.
అయితే మామకు తగిన వారసుడు అల్లుడే అని జనాలు డిసైడ్ అయితే టీడీపీదే ఈ సీటు అని అంటున్నారు. పెద్దాయన చివరి ప్రయత్నానికి అప్పీలు కి జనాల రియాక్షన్ ఎలా ఉంది అన్నది తేలడానికి రోజుల సమయమే మిగిలి ఉంది.