వైసీపీ ఎమ్మెల్సీ మీద అనర్హత కత్తి?

వైసీపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అంటూ ఆధారాలు సేకరించిన వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో వేటు అనివార్యంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ…

వైసీపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అంటూ ఆధారాలు సేకరించిన వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో వేటు అనివార్యంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మీద అనర్హత కత్తి వేలాడుతోంది.

ఆయన పార్టీకి తీవ్ర నష్టం కలిగించారు అన్న ఆధారాలు లభ్యం కావడంతో వేటుకు వేళ అయింది అని అంటున్నారు. శృంగవరపుకోటలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు అలాగే విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీకి వ్యతిరేకంగా రఘురాజు పనిచేశారు అని వైసీపీ నేతలు ఆధారసహితంగా చెబుతున్నారు.

ఆయన టీడీపీ నేతలతో చేతులు కలిపి ఇదంతా చేశారు అని అంటున్నారు. ఎస్ కోట వైఎస్ ఎంపీపీ అయిన తన సతీమణిని టీడీపీలో ఎన్నికలకు ముందే చేర్పించి తాను మాత్రం పార్టీలో ఉంటూ అవతల పక్షానికి ఎన్నికల్లో సాయం చేసిన రఘురాజు విషయంలో వైసీపీ సీరియస్ గానే ఉంది.

ఆయనకు ఇప్పటికే శాసనమండలి చైర్మన్ నుంచి నోటీసులు వెళ్లాయి. తన ముందు ఈ నెల 27వ తేదీన హాజరు కావాలని కోరినా డుమ్మా కొట్టారు. ఇపుడు మే 31న మరోసారి రమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఆయన హాజరవుతారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఆయన గైర్ హాజరు అయితే మాత్రం తన విచక్షణాధికారంతో మండలి చైర్మన్ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది.

ఇప్పటికే విశాఖలో ఒక ఎమ్మెల్సీ పార్టీ ఫిరాయించి ఎమ్మెల్సీ పదవి కోల్పోయారు. ఇపుడు ఈయన వంతు వచ్చింది అని అంటున్నారు. వైసీపీయే మరోసారి అధికారంలోకి వస్తుంది అన్న ధీమా ఉన్న వైసీపీ నేతలు పార్టీకి కట్టుబడి ఉన్న వారికే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు.