‘వాలంటీర్లకు 25వేల జీతం’ చెప్పొచ్చుగా పవన్!

నడిరోడ్ల మీద తన ఫ్లెక్సిలను పట్టుకుని  వాలంటీర్లు, ప్రధానంగా మహిళా వాలంటీర్లు తన బొమ్మను చెప్పులతో కొట్టడం ప్రారంభించిన తర్వాత.. తన బొమ్మను చెప్పుతో కొట్టడం అనేది ప్రాంతాల తేడాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒక…

నడిరోడ్ల మీద తన ఫ్లెక్సిలను పట్టుకుని  వాలంటీర్లు, ప్రధానంగా మహిళా వాలంటీర్లు తన బొమ్మను చెప్పులతో కొట్టడం ప్రారంభించిన తర్వాత.. తన బొమ్మను చెప్పుతో కొట్టడం అనేది ప్రాంతాల తేడాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమం అయిన తర్వాత.. జనసేనాని పవన్ కల్యాణ్ కు కాస్త బుద్ధి వచ్చినట్టుగా కనిపిస్తోంది. 

పెద్ద పెద్ద కటౌట్ లు, వందడుగుల క్రేన్ తో వేసే గజమాలలు, పూలవానలు, వందల సంఖ్యలో తన ఎదుట పగిలే టెంకాయలు ఇలాంటి వైభవాన్ని మాత్రమే ఎరిగిన ఈ సినిమా హీరో.. ఇలా ప్రజలు రాష్ట్రమంతా తన ఫ్లెక్సిలను చెప్పులతో కొట్టడాన్నీ, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే నైతిక స్థైర్యం జనసైనికుల్లో కొరవడడాన్ని ఊహించుకుని ఉండరు. ఇప్పుడు ఆయన వాలంటీర్లను దువ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో 17వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాలంటీర్లు, వైసీపీ నేతలతో కలిసి విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారంలాగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి.

తన బొమ్మలను చెప్పులతో కొడుతున్న వాలంటీర్లను బుజ్జగించడానికి, దువ్వడానికి ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు. వాలంటీర్ల మీద తనకు సానుభూతి పొంగిపోతున్నట్టుగా, వైఎస్ జగన్ వారందరికీ ద్రోహం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో యువసంపదను జగన్మోహన్ రెడ్డి కేవలం రూ.5వేలకే దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ తాజా సభల్లో ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. యువత సామర్థ్యాన్ని సీఎం అంచనా వేయలేకపోతున్నారని పవన్ సానుభూతి చూపిస్తున్నారు. వాలంటీర్ల పొట్టకొట్టడం తన ఉద్దేశం కాదంటున్నారు.

కానీ పవన్ తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. వాలంటీరు అనేది పర్మినెంటు ఉద్యోగం కాదు. యువత తమ స్థాయికి తగిన ఉద్యోగాలు ఎంచుకునే ముందు, ఖాళీగా ఉండకుండా ఈ పనిలో ఉంటే చాలు. అలాగే పవన్ కు అంతగా జాలి దయ ఉన్నట్లయితే.. యువసంపదను జగన్ ఐదువేలకు దోచుకుంటున్నారని నిందలు వేసే బదులుగా.. తన ప్రభుత్వం వస్తే వాలంటీర్ల వేతనం పాతిక వేలు చేస్తానని ప్రకటించవచ్చు కదా..? ఎవరు వద్దన్నారు? నిజానికి అలాంటి ప్రకటన చేస్తే.. పవన్ కల్యాణ్ కు చాలా ఎడ్వాంటేజీ వస్తుంది కదా? అనేది పలువురి మాట. 

చేతగాని మాటలతో, నైతికవిలువలు కూడా లేని నిందలతో వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టే బదులు పవన్ కల్యాణ్ తన మాటల ద్వారా.. కొన్ని కోట్ల మందిని నొప్పించాననే వాస్తవాన్ని గుర్తించి క్షమాపణ కోరితే ఆయనకు మనుగడ ఉంటుంది.